ప|| అటువంటి వైభవము లమర జేసిన దైవ- | మిటువంటి యోగంబు లిన్నియును జేసి ||
చ|| జలజాక్షి లావణ్య జలధినుప్పొంగిన | నలివేణి ముఖచంద్రు డభ్యుదయ మాయె |
కలికి వలరాయడను కాలకూటంబుతో | దలకొన్న యధరామృతంబు జన్మించె ||
చ|| వనిత సౌభాగ్యంబు వనధిలోపల దోచె | గొనకొన్న గుఱుతైన కుచపర్వతములు |
తనివోని కోరికల తగు తురంగములతో | ననువైన విరహ బడబానలము గలిగె ||
చ|| భామయవ్వన మనెడి పాలజలధిలోన | వామాక్షి యైన యవ్వన లక్ష్మి గలిగె | యీ మంచి తిరువేంకటేశ్వరుం డిందులో | బ్రేమమున సుఖియించి పెంపొందగలిగె ||
pa|| aTuvaMTi vaiBavamu lamara jEsina daiva- | miTuvaMTi yOgaMbu linniyunu jEsi ||
ca|| jalajAkShi lAvaNya jaladhinuppoMgina | nalivENi muKacaMdru DaByudaya mAye |
kaliki valarAyaDanu kAlakUTaMbutO | dalakonna yadharAmRutaMbu janmiMce ||
ca|| vanita sauBAgyaMbu vanadhilOpala dOce | gonakonna gurxutaina kucaparvatamulu |
tanivOni kOrikala tagu turaMgamulatO | nanuvaina viraha baDabAnalamu galige ||
ca|| BAmayavvana maneDi pAlajaladhilOna | vAmAkShi yaina yavvana lakShmi galige |
yI maMci tiruvEMkaTESvaruM DiMdulO | brEmamuna suKiyiMci peMpoMdagalige ||