ప|| అటుచూడు సతినేర్పు లవుభళేశ | అటుమటములు గావు అవుభళేశ ||
చ|| యెదురు గొండల మీద నెక్కినట్టి లకిమమ్మ | అదివో నీ తొడ యెక్కినౌభళేశ |
వుదుటున నంతలోనే వురముపై నెలకొని | అదిమీ జన్నుల నిన్ను నౌభళేశ ||
చ|| ముంగోపముతోడను మొక్కలీడవైన నిన్ను | నంగన గద్దెపై బెట్టె నౌభళేశ |
కంగక వేదాద్రి నిన్ను గరుడాద్రికి దీసె | అంగా లంటె నింటిలోన నౌభళేశ ||
చ|| చేరి నీవు నవ నారసింహరూపులైతే జెలి | ఆ రీతుల నిన్ను గూడె నౌభళేశ |
గారవాన నీవు శ్రీ వేంకటముపై నుండగాను | అరసి రతి మెప్పించె నౌభళేశ ||
pa|| aTucUDu satinErpu lavuBaLESa | aTumaTamulu gAvu avuBaLESa ||
ca|| yeduru goMDala mIda nekkinaTTi lakimamma | adivO nI toDa yekkinauBaLESa | vuduTuna naMtalOnE vuramupai nelakoni | adimI jannula ninnu nauBaLESa ||
ca|| muMgOpamutODanu mokkalIDavaina ninnu | naMgana gaddepai beTTe nauBaLESa | kaMgaka vEdAdri ninnu garuDAdriki dIse | aMgA laMTe niMTilOna nauBaLESa ||
ca|| cEri nIvu nava nArasiMharUpulaitE jeli | A rItula ninnu gUDe nauBaLESa |
gAravAna nIvu SrI vEMkaTamupai nuMDagAnu | arasi rati meppiMce nauBaLESa ||