ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి యిదిగాక వైభవం బిక నొకటి కలదా
అతివ జన్మము సఫలమై పరమయోగివలె నితర మోహాపేక్ష లిన్నియును విడిచె సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ సతత విజ్ఞాన వాసన వోలె నుండె
తరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది పరవశానంద సంపదకు నిరవాయ సరసిజానన మనో జయ మంది యింతలో సరిలేక మనసు నిశ్చలభావమాయ
శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ భావంబు నిజముగా బట్టె జెలియాత్మ దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు లావణ్యవతికి నుల్లంబు దిరమాయ
Idigaaka saubhaagya midigaaka tapamu ma~ri Yidigaaka vaibhavam bika nokati kaladaa
Ativa janmamu saphalamai paramayogivale Nitara mohaapaeksha linniyunu vidiche Sati korikalu mahaasaamtamai yide chooda Satata vij~naana vaasana vole numde
Taruni hrdayamu krtaarthata bomdi vibhumeedi Paravasaanamda sampadaku niravaaya Sarasijaanana mano jaya mamdi yimtalo Sarilaeka manasu nischalabhaavamaaya
Sree vaemkataesvaruni jimtimchi paratattva Bhaavambu nijamugaa batte jeliyaatma Daevottamuni krpaadheenuraalai yipudu Laavanyavatiki nullambu diramaaya