ప|| ఇదిగో మా యజ్ఞాన మెప్పుడును సహజమే | కదిసి నీవే కరుణించవయ్యా ||
చ|| తల్లిచంకనున్న బిడ్డ తమితో జన్నుదాగు తా- | నొల్లడు తండ్రి యెత్తుకొన బోతేను |
మల్లడి నీ మాయలో మరిగిన జీవముల | మెల్లనె మీసేవజేసి మిమ్ము జేరజాలము ||
చ|| రెక్కల మరుగుపక్షి రెక్కలక్రిందనే కాని | యెక్కడు వద్దనే మేడ యెంతవున్నను |
ప్రక్కన జన్మమెత్తిన ప్రపంచపు జీవులము | యెక్కుడైన వైకుంఠ మిది గోరజాలము ||
చ|| నీరులో నుండేటి కప్ప నీటిలో వుండుగాని | వూరకే పరుపు మీద నుండదెంతైనను ||
అరయ సంసారములో అజ్ఞానపు జీవులము | బోరన శ్రీవేంకటేశ బుద్ధి చెప్పికావవె ||
pa|| idigO mA yaj~jAna meppuDunu sahajamE | kadisi nIvE karuNiMcavayyA ||
ca|| tallicaMkanunna biDDa tamitO jannudAgu tA- | nollaDu taMDri yettukona bOtEnu |
mallaDi nI mAyalO marigina jIvamula | mellane mIsEvajEsi mimmu jErajAlamu ||
ca|| rekkala marugupakShi rekkalakriMdanE kAni | yekkaDu vaddanE mEDa yeMtavunnanu |
prakkana janmamettina prapaMcapu jIvulamu | yekkuDaina vaikuMTha midi gOrajAlamu ||
ca|| nIrulO nuMDETi kappa nITilO vuMDugAni | vUrakE parupu mIda nuMDadeMtainanu ||
araya saMsAramulO aj~jAnapu jIvulamu | bOrana SrIvEMkaTESa buddhi ceppikAvave ||