ప|| ఇందిరాధిపునిసేవ యేమరకుండుటగాక | బొందితోడిజీవులకు బుద్ధు లేటిబుద్ధులు ||
చ|| రేయెల్లా మింగిమింగి రేపే వెళ్ళనిమియు | బాయట నిద్రాదేవి పలుమారును |
చాయలకు నిచ్చానిచ్చా జచ్చిచచ్చి పొడమేటి- | మాయజీవులకునెల్లా మని కేటిమనికి ||
చ|| కనురెప్ప మూసితేనే కడు సిష్టే చీకటౌను | కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు |
ఘనమై నిమిషమందే కలిమి లేమియు దోచె | యెనయుజీవుల కింక యెఱు కేటియెఱుక ||
చ|| వొప్పగుబ్రాణము లవి వూరుగాలివెంట | యెప్పుడు లోనివెలికి నెడతాకును |
అప్పుడు శ్రీవేంకటేశు డంతరాత్ము డందరికి | తప్పక యాతడే కాచు తల పేటితలపు ||
pa|| iMdirAdhipunisEva yEmarakuMDuTagAka | boMditODijIvulaku buddhu lETibuddhulu ||
ca|| rEyellA miMgimiMgi rEpE veLLanimiyu | bAyaTa nidrAdEvi palumArunu |
cAyalaku niccAniccA jaccicacci poDamETi- | mAyajIvulakunellA mani kETimaniki ||
ca|| kanureppa mUsitEnE kaDu siShTE cIkaTaunu | kanureppa deracitE krammara buTTu |
Ganamai nimiShamaMdE kalimi lEmiyu dOce | yenayujIvula kiMka yerxu kETiyerxuka ||
ca|| voppagubrANamu lavi vUrugAliveMTa | yeppuDu lOniveliki neDatAkunu |
appuDu SrIvEMkaTESu DaMtarAtmu DaMdariki | tappaka yAtaDE kAcu tala pETitalapu ||