ప|| ఇందుకేనా విభుడు నీయింట నెలకొన్నాడు | కందువెఱుగుదువు యీకత నీవే నేర్తువే ||
చ|| నయమెంత గలిగినా ననుపులకే మేలు | ప్రియమెంత గలిగినా పెనపులకే మేలు |
జయమెంత గలిగినా చనవులకే మేలు | క్రియలెఱుగుదువు యీకీలు నీవే నేర్తువే ||
చ|| మొగమెంత చూచినా మోహానకే మూలము | తగవెంత నెరపినా తగులుకే మూలము |
నగవెంత గలిగినాను నమ్మికలకు మూలము | పగటెరుగుదువు యీపాడి నీవే నేర్తువే ||
చ|| వూడిగ మెంతసేసినా వొద్దికలకే దాపు | వేడుకెంత నిలిపినా విఱ్ఱవీగుటకే దాపు |
కూడితివిన్ని చందాల కోరిక శ్రీ వేంకటేశు | జాడెఱుగుదువు సరసము సరసము నీవే నేర్తువు ||
pa|| iMdukEnA viBuDu nIyiMTa nelakonnADu | kaMduverxuguduvu yIkata nIvE nErtuvE ||
ca|| nayameMta galiginA nanupulakE mElu | priyameMta galiginA penapulakE mElu | jayameMta galiginA canavulakE mElu | kriyalerxuguduvu yIkIlu nIvE nErtuvE ||
ca|| mogameMta cUcinA mOhAnakE mUlamu | tagaveMta nerapinA tagulukE mUlamu | nagaveMta galiginAnu nammikalaku mUlamu | pagaTeruguduvu yIpADi nIvE nErtuvE ||
ca|| vUDiga meMtasEsinA voddikalakE dApu | vEDukeMta nilipinA virxrxavIguTakE dApu | kUDitivinni caMdAla kOrika SrI vEMkaTESu | jADerxuguduvu sarasamu sarasamu nIvE nErtuvu ||