ప|| ఇన్నినేతలకు నిది యొకటే | కన్నా మన సిది కానదుగాని||
చ|| పాతకకోట్లు భవములు భస్మీ- | భూతముసేయగ బొడవొకటే |
శ్రీతరుణీపతిచింత, నిజముగా | యేతరి చిత్తం బెఱగదుగాని ||
చ|| మరణభయంబులు మదములు మలినీ- | కరణము సేయగగల దొకటే |
హరినామామృత మందుమీది రతి | నిరతము నాకిది నిలువదుగాని ||
చ|| కుతిలములును దుర్గుణములును దృణీ- | కృతములు సేయగ గురుతొకటే |
పతియగు వేంకటపతి సేవారతి, | గతియని మతిగని కానదుగాని ||
pa|| inninEtalaku nidi yokaTE | kannA mana sidi kAnadugAni||
ca|| pAtakakOTlu Bavamulu BasmI- | BUtamusEyaga boDavokaTE |
SrItaruNIpaticiMta, nijamugA | yEtari cittaM berxagadugAni ||
ca|| maraNaBayaMbulu madamulu malinI- | karaNamu sEyagagala dokaTE |
harinAmAmRuta maMdumIdi rati | niratamu nAkidi niluvadugAni ||
ca|| kutilamulunu durguNamulunu dRuNI- | kRutamulu sEyaga gurutokaTE |
patiyagu vEMkaTapati sEvArati, | gatiyani matigani kAnadugAni ||