ప|| ఇతరమెరుగ గతి ఇదియే శరణ్యము | సతత పూర్ణునికి శరణ్యము ||
చ|| సకలలోకముల సాక్షియై గాచిన | సర్వేశ్వరునకు శరణ్యము |
ఉర్వికి మింటికి ఒక్కట మెరిగిన | సార్వభౌమునకు శరణ్యము ||
చ|| శ్రీకాంత నురము చెంగట నిలిపిన | సాకారునకును శరణ్యము |
పైకొని వెలిగేటి పరంజ్యోతి యౌ | సౌకుమారునకు శరణ్యము ||
చ|| తగ నిహ పరములు దాసుల కొసగెడి | జగదీశ్వరునకు శరణ్యము |
నగు శ్రీ వేంకట నాథుడ నీకు |సుగుణమూర్తి యిదె శరణ్యము ||
pa|| itarameruga gati idiyE SaraNyamu | satata pUrNuniki SaraNyamu ||
ca|| sakalalOkamula sAkShiyai gAcina | sarvESvarunaku SaraNyamu |
urviki miMTiki okkaTa merigina | sArvaBaumunaku SaraNyamu ||
ca|| SrIkAMta nuramu ceMgaTa nilipina | sAkArunakunu SaraNyamu |
paikoni veligETi paraMjyOti yau | saukumArunaku SaraNyamu ||
ca|| taga niha paramulu dAsula kosageDi | jagadISvarunaku SaraNyamu |
nagu SrI vEMkaTa nAthuDa nIku |suguNamUrti yide SaraNyamu ||
itarameruga gati - ఇతరమెరుగ గతి
5:52 AM
I- Annamayya, ఇ