ప|| ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు | పతులకు సతులకు భావజుడే సాక్షి ||
చ|| తలపు గలిగితేను దవ్వులేమి చేరువేమి | అలరు సమ్మతించితె నడ్డాకలేమి |
కొలది మీరినప్పుడు కొంచెమేమి దొడ్డయేమి | సెలవిచ్చి యేకతాన జేసినది చేత ||
చ|| యిచ్చకమె కలిగితే యెక్కువేమి తక్కువేమి | హెచ్చిన మోహములకు నెగ్గు సిగ్గేది |
పచ్చియైన పనులకు పాడియాల పంతమేల | చెచ్చెర దమకు దాము చెప్పినది మాట ||
చ|| అన్నిటా నొక్కటియైతే నైన దేమి కానిదేమి | యెన్నికల కెక్కితేను యీడు జోడేది |
వున్నతి శ్రీ వేంకటేశు డొనగూడె నేర్పులివి | కన్నెలు దా గూడిన గతులే సంగతులు ||
pa|| itaru lEmerugudu rEmani ceppaga vaccu | patulaku satulaku BAvajuDE sAkShi ||
ca|| talapu galigitEnu davvulEmi cEruvEmi | alaru sammatiMcite naDDAkalEmi |
koladi mIrinappuDu koMcemEmi doDDayEmi | selavicci yEkatAna jEsinadi cEta ||
ca|| yiccakame kaligitE yekkuvEmi takkuvEmi | heccina mOhamulaku neggu siggEdi |
pacciyaina panulaku pADiyAla paMtamEla | ceccera damaku dAmu ceppinadi mATa ||
ca|| anniTA nokkaTiyaitE naina dEmi kAnidEmi | yennikala kekkitEnu yIDu jODEdi |
vunnati SrI vEMkaTESu DonagUDe nErpulivi | kannelu dA gUDina gatulE saMgatulu ||
itaru lEmerugudu - ఇతరు లేమెరుగుదు
5:54 AM
I- Annamayya, ఇ