ప|| ఇతరము లిన్నియు నేమిటికి | మతిచంచలమే మానుట పరము ||
చ|| ఎక్కడిసురపుర మెక్కడివైభవ- | మెక్కడి విన్నియు నేమిటికి |
యిక్కడనే పరహితమును బుణ్యము | గక్కున జేయగ గల దిహపరము ||
చ|| యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు- | లెవ్వరిందరును నేమిటికి |
రవ్వగులక్ష్మీరమణుని దలపుచు | యివ్వల దా సుఖియించుట పరము ||
చ|| యెందరు దైవము లెందరు వేల్పులు | యెందరిందరును నేమిటికి |
కందువెరిగి వేంకటగిరిరమణుని | చిందులేక కొలిచిన దిహపరము ||
pa|| itaramu linniyu nEmiTiki | maticaMcalamE mAnuTa paramu ||
ca|| ekkaDisurapura mekkaDivaiBava- | mekkaDi vinniyu nEmiTiki |
yikkaDanE parahitamunu buNyamu | gakkuna jEyaga gala dihaparamu ||
ca|| yevvaru cuTTamu levvaru baMdhuvu- | levvariMdarunu nEmiTiki |
ravvagulakShmIramaNuni dalapucu | yivvala dA suKiyiMcuTa paramu ||
ca|| yeMdaru daivamu leMdaru vElpulu | yeMdariMdarunu nEmiTiki |
kaMduverigi vEMkaTagiriramaNuni | ciMdulEka kolicina dihaparamu ||
itaramu linniyu - ఇతరము లిన్నియు
5:51 AM
I- Annamayya, ఇ