ప|| ఇతరులకు నిను నెరుగదరమా ||
అప|| సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- | హితులెరుగుదురు నిను నిందిరారమణా ||
చ|| నారీకటాక్షపటునారాచభయరహిత- | శూరులెరుగుదురు నిను జూచేటిచూపు |
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- | ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ||
చ|| రాగభోగవిదూర రంజితాత్ములు మహా- | భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము |
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- | యోగులెరుగుదురు నీవుండేటివునికి ||
చ|| పరమభాగవత పదపద్మసేవానిజా- | భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు |
పరగునిత్యానంద పరిపూర్ణమానస- | స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ||
pa|| itarulaku ninu nerugadaramA ||
apa|| satatasatyavratulu saMpUrNamOhavira- | hituleruguduru ninu niMdirAramaNA ||
ca|| nArIkaTAkShapaTunArAcaBayarahita- | SUruleruguduru ninu jUcETicUpu |
GorasaMsAra saMkulaparicCEdulagu- | dhIruleruguduru nIdivyavigrahamu ||
ca|| rAgaBOgavidUra raMjitAtmulu mahA- | BAguleruguduru ninu braNutiMcuvidhamu |
AgamOktaprakArABigamyulu mahA- | yOguleruguduru nIvuMDETivuniki ||
ca|| paramaBAgavata padapadmasEvAnijA- | BaraNu leruguduru nIpalikETipaluku |
paragunityAnaMda paripUrNamAnasa- | sthiru leruguduru ninu diruvEMkaTESa ||
itarulaku ninu - ఇతరులకు నిను
5:56 AM
I- Annamayya, ఇ