ప|| ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటూ | కొత్తసేతలెల్ల దొరకొంటిగా నీవు ||
చ|| హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన- | మైనపదవుల బెట్టేయటువలెనే |
మానక యెవ్వతెనైన మచ్చిక దగిలి నాతో- | నానిపట్టి సరిసేసే వద్దిరా నీవూ ||
చ|| కడుబాతకులు నిన్ను గదిసి కొలిచేరంటా- | నడరి పుణ్యులజేయునటువలెనే |
కడగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి | వడి నన్ను గెరలించవద్దురా నీవూ ||
చ|| దిందుపడ మాయసేసి దేవుడ నేగానంటా- | నందరి భ్రమలబెట్టునటువలెనే |
అందమైనతిరువేంకటాద్రీశ నీప్రేమ | చెంది నన్ను గూడి దాచజెల్లునా నీవూ ||
pa|| ittaDi baMgArusEya niMtaku nErutunaMTU | kottasEtalella dorakoMTigA nIvu ||
ca|| hInulainavAru ninnu nEci kolicina Gana- | mainapadavula beTTEyaTuvalenE |
mAnaka yevvatenaina maccika dagili nAtO- | nAnipaTTi sarisEsE vaddirA nIvU ||
ca|| kaDubAtakulu ninnu gadisi kolicEraMTA- | naDari puNyulajEyunaTuvalenE |
kaDagi yevvatenaina gAju mANikamu sEsi | vaDi nannu geraliMcavaddurA nIvU ||
ca|| diMdupaDa mAyasEsi dEvuDa nEgAnaMTA- | naMdari BramalabeTTunaTuvalenE |
aMdamainatiruvEMkaTAdrISa nIprEma | ceMdi nannu gUDi dAcajellunA nIvU ||
ittaDi baMgArusEya - ఇత్తడి బంగారుసేయ
5:58 AM
I- Annamayya, ఇ