ప|| ఎక్కడి కంసుడు యిక నెక్కడి భూభారము | చిక్కువాప జనియించె శ్రీకృష్ణుడు ||
చ|| అదివో చంద్రోదయ మదివో రోహిణిపొద్దు | అదన శ్రీకృష్ణుడందె నవతారము |
గదయు శంఖచక్రాలుగల నాలుగు చేతుల | నెదిరించియున్నాడు ఇదివో బాలుడు ||
చ|| వసుదేవుడల్ల వాడే వరుస దేవకి యదే | కొసరే బ్రహ్మాదుల కొండాట మదె |
పొసగ బొత్తులమీద బురుటింటి లోపల |శిసువై మహిమ చూపె శ్రీకృష్ణుడు ||
చ|| పరంజ్యోతిరూప మిది పాండవుల బ్రదికించె | అరిది కౌరవుల సంహారమూ నిదె |
హరికర్ఘ్యము లీరో జయంతి పండుగ సేయరో | కెరలి శ్రీవేంకటాద్రి కృష్ణుడితడు ||
pa|| ekkaDi kaMsuDu yika nekkaDi BUBAramu | cikkuvApa janiyiMce SrIkRuShNuDu ||
ca|| adivO caMdrOdaya madivO rOhiNipoddu | adana SrIkRuShNuDaMde navatAramu |
gadayu SaMKacakrAlugala nAlugu cEtula | nediriMciyunnADu idivO bAluDu ||
ca|| vasudEvuDalla vADE varusa dEvaki yadE | kosarE brahmAdula koMDATa made |
posaga bottulamIda buruTiMTi lOpala |Sisuvai mahima cUpe SrIkRuShNuDu ||
ca|| paraMjyOtirUpa midi pAMDavula bradikiMce | aridi kauravula saMhAramU nide |
harikarGyamu lIrO jayaMti paMDuga sEyarO | kerali SrIvEMkaTAdri kRuShNuDitaDu ||