ప|| ఎక్కగా రాగా రాగా యిందాకా దగులు | యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు ||
చ|| తెగనికర్మమునకు దేహము తగులు | తగినదేహమునకు తరుణితో తగులు |
సొగిసి యీరెంటికి సుతు లొక్కతగులు | అగడాయ గనకము అన్నిటితో తగులు ||
చ|| యింతటిసంసారికి యిల్లొక్కతగులు | బంతికి నందు గలిగె పాడిపంట తగులు |
చెంత నీలంపటానకు క్షేత్రము తగులు | సంతగూడేదాసదాసీజనులెల్లా ద్గులు ||
చ|| మొదల జీవుడొక్కడే మోపులాయ దగులు | వదలనిబంధములు వడ్డివారె దగులు |
వుదుటిహము బరము నొక్కయందె తగులు | అదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు ||
pa|| ekkagA rAgA rAgA yiMdAkA dagulu | yikkuva SrIharimAya niMkaneMtO tagulu ||
ca|| teganikarmamunaku dEhamu tagulu | taginadEhamunaku taruNitO tagulu |
sogisi yIreMTiki sutu lokkatagulu | agaDAya ganakamu anniTitO tagulu ||
ca|| yiMtaTisaMsAriki yillokkatagulu | baMtiki naMdu galige pADipaMTa tagulu |
ceMta nIlaMpaTAnaku kShEtramu tagulu | saMtagUDEdAsadAsIjanulellA dgulu ||
ca|| modala jIvuDokkaDE mOpulAya dagulu | vadalanibaMdhamulu vaDDivAre dagulu |
vuduTihamu baramu nokkayaMde tagulu | ade SrIvEMkaTapati yaMtarAtma tagulu ||