ప|| ఎందు బొడమితిమో యెఱుగము మా- | కందువ శ్రీహరికరుణేకాక ||
చ|| ఏటిజన్మమో యెఱగము పర- | మేటిదో నే మెఱగము |
గాటపుకమలజు గాచినయీ- | నాటకుడే మానమ్మినవిభుడు ||
చ|| యెవ్వారు వేల్పులో యెఱుగము సుర- | లెవ్వరో నే మెఱుగము |
రవ్వగుశ్రీ సతిరమణుడు మా- | కవ్వనజోదరు డంతరియామి ||
చ|| యింకానేటిదో యెఱగము యీ- | యంకెలబాముల నలయము |
జంకెల దనుజుల జదిపినతిరు- | వేంకటేశుడు మావిడువనివిభుడు ||
pa|| eMdu boDamitimO yerxugamu mA- | kaMduva SrIharikaruNEkAka ||
ca|| ETijanmamO yerxagamu para- | mETidO nE merxagamu |
gATapukamalaju gAcinayI- | nATakuDE mAnamminaviBuDu ||
ca|| yevvAru vElpulO yerxugamu sura- | levvarO nE merxugamu |
ravvaguSrI satiramaNuDu mA- | kavvanajOdaru DaMtariyAmi ||
ca|| yiMkAnETidO yerxagamu yI- | yaMkelabAmula nalayamu |
jaMkela danujula jadipinatiru- | vEMkaTESuDu mAviDuvaniviBuDu ||