ప|| ఎంత మానుమన్న జింతలేల మానునే | పంతపుమనసు హరిపై నుంటేగాక ||
చ|| తీరనిబంధాలు నేడే తెగుమంటే నేలతెగు | భారపుమమత బెడబాసినగాక |
వూరటగా మమత నేనొల్లనంటే నేలమాను | వోరుపుతో లంపటము లొల్లకుంటేగాక
చ|| వేకపుగోపము నేడే విడుమంటే నేలవిడు | తోకచిచ్చయినయాస దుంచినగాక |
ఆకట నానేలమాను అన్నిటాను యిందరికి | మాకుపడి తత్తరము మరచుంటేగాక ||
చ|| పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటె నేలపెట్టు | యిట్టే వేంకటపతి యిచ్చినగాక |
యిట్టునిట్టు నీతడు దానిందరికి నేలయిచ్చు | వొట్టినవిరక్తి నేమీ నొల్లకుంటేగాక ||
pa|| eMta mAnumanna jiMtalEla mAnunE | paMtapumanasu haripai nuMTEgAka ||
ca|| tIranibaMdhAlu nEDE tegumaMTE nElategu | BArapumamata beDabAsinagAka |
vUraTagA mamata nEnollanaMTE nElamAnu | vOruputO laMpaTamu lollakuMTEgAka
ca|| vEkapugOpamu nEDE viDumaMTE nElaviDu | tOkaciccayinayAsa duMcinagAka |
AkaTa nAnElamAnu anniTAnu yiMdariki | mAkupaDi tattaramu maracuMTEgAka ||
ca|| peTTanidi daivamiTTE peTTumaMTe nElapeTTu | yiTTE vEMkaTapati yiccinagAka |
yiTTuniTTu nItaDu dAniMdariki nElayiccu | voTTinavirakti nEmI nollakuMTEgAka ||