ప|| ఎంత లేదు చిత్తమా యీతలేల మోతలేల | వంతులకు బారనేల వగరించనేలా ||
చ|| దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల | చిక్కి నంతకే సంతసించ రాదా |
ఒక్కమాటే వుప్పుదిని వుపదాప మందనేల | చక్క జూడ దగినంతే చవి గొనరాదా ||
చ|| పారి పారి వేడ నేల బడలిక పడనేల | మీరిదైన మిచ్చినంతే మెచ్చరాదా |
వీరిడై పొడవెక్కి విరుగ బడగనేల | చేరి యుండినంతకే చేచాచరాదా ||
చ|| జీవులుగొలువనేల సిలుగుల బడనేల | శ్రీవేంకటేశుడాత్మ జిక్కి వుండగా |
దావతి పడగనేల దప్పుల బొరలనేల | కైవశమైనందుకే గతి గూడ రాదా ||
pa|| eMta lEdu cittamA yItalEla mOtalEla | vaMtulaku bAranEla vagariMcanElA ||
ca|| dakkanivi gOranEla taTTumuTTu paDanEla | cikki naMtakE saMtasiMca rAdA |
okkamATE vuppudini vupadApa maMdanEla | cakka jUDa daginaMtE cavi gonarAdA ||
ca|| pAri pAri vEDa nEla baDalika paDanEla | mIridaina miccinaMtE meccarAdA |
vIriDai poDavekki viruga baDaganEla | cEri yuMDinaMtakE cEcAcarAdA ||
ca|| jIvulugoluvanEla silugula baDanEla | SrIvEMkaTESuDAtma jikki vuMDagA |
dAvati paDaganEla dappula boralanEla | kaivaSamainaMdukE gati gUDa rAdA ||