ప|| ఎంత మీదు కట్టెనో యింతి నీకు జవ్వనము | కాంతుడవేమి సేసితో కానుకలంపె చెలి ||
చ|| నిద్దరించవలసినా నీ కౌగిటనే కాని | వొద్ద నిన్ను బాసి వొంటినొల్లదు చెలి |
కొద్దిగా మాటాడినాను కోరి నీతోనే కాని | ముద్దరించి పరులతో మోసమే చెలి ||
చ|| ఆరగించవలసినా అటు నీ పొత్తునగాని | వూరకే వేరెయైతే నొల్లదు చెలి |
సారె విడెమిచ్చినాను సగమాకు నీకియ్యక | చేరి వేరే తమ్ములము చేయదు చెలి ||
చ|| కొమ్మ పయ్యద గప్పినా గూడ నీతోగాని | వుమ్మడి దనంతనైతే నొల్లదు చెలి |
యిమ్ముల శ్రీ వేంకటేశ యింతలో గూడితిగాని | బమ్మర వెట్టినా నీకు బాయదు చెలి ||
pa|| eMta mIdu kaTTenO yiMti nIku javvanamu | kAMtuDavEmi sEsitO kAnukalaMpe celi ||
ca|| niddariMcavalasinA nI kaugiTanE kAni | vodda ninnu bAsi voMTinolladu celi |
koddigA mATADinAnu kOri nItOnE kAni | muddariMci parulatO mOsamE celi ||
ca|| AragiMcavalasinA aTu nI pottunagAni | vUrakE vEreyaitE nolladu celi |
sAre viDemiccinAnu sagamAku nIkiyyaka | cEri vErE tammulamu cEyadu celi ||
ca|| komma payyada gappinA gUDa nItOgAni | vummaDi danaMtanaitE nolladu celi |
yimmula SrI vEMkaTESa yiMtalO gUDitigAni | bammara veTTinA nIku bAyadu celi ||