ప|| ఎట్టున్నదో నీమనసు యేమి సేతురా | యెట్టనెదుట బాయలే నేమి సేతురా ||
చ|| చూచుదాకా వేగిరింత సొంపుగా విభుడ నీతో | దాచి మాటాడిన దాక దమకింతును |
చెచేత దమకింతు చేరువ దాకానిట్లనె | యేచి తమకమేనిండె నేమి సేతురా ||
చ|| అట్టె నీ చెనకులకు నాసగింతు దనివోక | ముట్టి యాసగింతు నీమోవి తేనెకు |
గట్టిగా నంతటి మీద కౌగిటికి నాసగింతు | యెట్లైనా నాసలే నిండె నేమిసేతురా ||
చ|| ఆదన నీమేనంటి అట్టె పరవశమవుదు | వదలక కూడి పరవశమవుదును |
పొదలి శ్రీ వేంకటేశ పొందితివి నన్ను నిట్టే | యెదిరించె బరవశాలేమి సేతురా ||
pa|| eTTunnadO nImanasu yEmi sEturA | yeTTaneduTa bAyalE nEmi sEturA ||
ca|| cUcudAkA vEgiriMta soMpugA viBuDa nItO | dAci mATADina dAka damakiMtunu |
cecEta damakiMtu cEruva dAkAniTlane | yEci tamakamEniMDe nEmi sEturA ||
ca|| aTTe nI cenakulaku nAsagiMtu danivOka | muTTi yAsagiMtu nImOvi tEneku |
gaTTigA naMtaTi mIda kaugiTiki nAsagiMtu | yeTlainA nAsalE niMDe nEmisEturA ||
ca|| Adana nImEnaMTi aTTe paravaSamavudu | vadalaka kUDi paravaSamavudunu |
podali SrI vEMkaTESa poMditivi nannu niTTE | yediriMce baravaSAlEmi sEturA ||