ప|| ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన | గుడుసువడె జదువు, మెరుగులవారె జలము ||
చ|| లంపు మేయగదొణగె లలితంపుమతి లోనె, | తెంపు దిగవిడిచె యెడతెగనిమానంబు, |
చంప దొరకొనియె వేసటలేనితమకంబు, | యింపు ఘనమాయ నె నికనేమి సేతు ||
చ|| బయలువందిలివెట్టె పనిలేనిలంపటము, | దయ విడువదొడగె చిత్తములోనికాంక్ష, |
పయికొన్న మోహంబు పడనిపాట్ల బరచె, | లయమాయ శాంతి మెల్లనె తీరె నెరుక ||
చ|| చావుబుట్టువు మఱచె సంసారబంధంబు, | దైవమును విడిచెనే తరికంపుబ్రియము |
శ్రీవేంకటేశ్వరుడు చిత్తరంజకుడు యిక | గావలసినది యతనికరుణ ప్రాణులకు ||
pa|| eDamapuriveTTe parahitavivEkamu, lOna | guDusuvaDe jaduvu, merugulavAre jalamu ||
ca|| laMpu mEyagadoNage lalitaMpumati lOne, | teMpu digaviDice yeDateganimAnaMbu, |
caMpa dorakoniye vEsaTalEnitamakaMbu, | yiMpu GanamAya ne nikanEmi sEtu ||
ca|| bayaluvaMdiliveTTe panilEnilaMpaTamu, | daya viDuvadoDage cittamulOnikAMkSha, |
payikonna mOhaMbu paDanipATla barace, | layamAya SAMti mellane tIre neruka ||
ca|| cAvubuTTuvu marxace saMsArabaMdhaMbu, | daivamunu viDicenE tarikaMpubriyamu |
SrIvEMkaTESvaruDu cittaraMjakuDu yika | gAvalasinadi yatanikaruNa prANulaku ||