ప|| ఎత్తరే ఆరతులీపై కింతులాల | హత్తెను శ్రీవేంకటేశు కలమేలుమంగ ||
చ|| హరి వురముపై సొమ్ము అరతగట్టిన తాళి | సరిలేని దేవుని సంసార ఫలము |
సిరులకు బుట్టినిల్లు సింగారముల విత్తు | మెరగుబోడి యలమేలుమంగ ||
చ|| పరమాత్మునికి నాత్మభావములో కీలుబొమ్మ | కెరలుచు నితడు భోగించే మేడ ||
సరసపు సముద్రము సతమైన కొంగుపైడి | అరిది సంపదలది యలమేలుమంగ ||
చ|| శ్రీవేంకటేశుని దేవి చిత్తజుగన్నతల్లి | యీవిభుని కాగిటిలో యేచినకళ |
బూవపు పెండ్లి మేలు పొందిన నిధానము | ఆవల నీవల నీపె యలమేలుమంగ ||
pa|| ettarE AratulIpai kiMtulAla | hattenu SrIvEMkaTESu kalamElumaMga ||
ca|| hari vuramupai sommu aratagaTTina tALi | sarilEni dEvuni saMsAra Palamu |
sirulaku buTTinillu siMgAramula vittu | meragubODi yalamElumaMga ||
ca|| paramAtmuniki nAtmaBAvamulO kIlubomma | keralucu nitaDu BOgiMcE mEDa ||
sarasapu samudramu satamaina koMgupaiDi | aridi saMpadaladi yalamElumaMga ||
ca|| SrIvEMkaTESuni dEvi cittajugannatalli | yIviBuni kAgiTilO yEcinakaLa |
bUvapu peMDli mElu poMdina nidhAnamu | Avala nIvala nIpe yalamElumaMga ||