ప|| ఏది కడ దీనికేది మొదలు వట్టి- | వేదనలు తన్ను విడుచు టెన్నడు ||
చ|| తొడరినహృదయమే తోడిదొంగయై | వడిగొని తన్ను వలబెట్టగాను |
కడగి కర్మముల గడచు టెన్నడు | నిడివిబంధముల నీగు టెన్నడు ||
చ|| తతిగొన్న తలపులే దైవయోగమై | మతినుండి తన్ను మరగించగాను |
ప్రతిలేనియాపద బాయు టెన్నడు | ధృతిమాలినయాస దీరు టెన్నడు ||
చ|| పొదలినమమతయే భూతమై తన్ను | బొదిగొని బుద్ధి బోధించగాను |
కదిసి వేంకటపతి గనుట యెన్నడు | తుదిలేనిభవముల దొలగు టెన్నడు ||
pa|| Edi kaDa dInikEdi modalu vaTTi- | vEdanalu tannu viDucu TennaDu ||
ca|| toDarinahRudayamE tODidoMgayai | vaDigoni tannu valabeTTagAnu |
kaDagi karmamula gaDacu TennaDu | niDivibaMdhamula nIgu TennaDu ||
ca|| tatigonna talapulE daivayOgamai | matinuMDi tannu maragiMcagAnu |
pratilEniyApada bAyu TennaDu | dhRutimAlinayAsa dIru TennaDu ||
ca|| podalinamamatayE BUtamai tannu | bodigoni buddhi bOdhiMcagAnu |
kadisi vEMkaTapati ganuTa yennaDu | tudilEniBavamula dolagu TennaDu ||