ప|| ఎదురు గుదురుగాను మేల నవ్వీనే | యెదుగా తడవునుండి యేల నవ్వీనే ||
చ|| వరుసలు వంతులును వనితల మాదుకోగా | యిరవైన విభుడు తానేల నవ్వీనే |
తరమిడి నిద్దరము తన్ను దగ వడిగితే | యెరవులు సేసుకొని యేల నవ్వీనే ||
చ|| వొక్కరొక్కరము సొమ్ములొనరగ సిరిచూడగ | యిక్కువైన రమణుడు యేల నవ్వీనీ |
చకగామాలోనే మమ్ము సంతసముసేయమంటాను | యిక్కడా మామోము చూచి యేల నవ్వీనే ||
చ|| మోవిమీద గుఱుతులు మూసుకొనే మమ్ముజూచి | యీవేళ శ్రీవేంకటేశుడేల నవ్వీనే |
భావించి మమ్మేలితివి పాడి దిద్దుమంటేను | యే వెలదులతోనైన నేల నవ్వీనే ||
pa|| eduru gudurugAnu mEla navvInE | yedugA taDavunuMDi yEla navvInE ||
ca|| varusalu vaMtulunu vanitala mAdukOgA | yiravaina viBuDu tAnEla navvInE |
taramiDi niddaramu tannu daga vaDigitE | yeravulu sEsukoni yEla navvInE ||
ca|| vokkarokkaramu sommulonaraga siricUDaga | yikkuvaina ramaNuDu yEla navvInI |
cakagAmAlOnE mammu saMtasamusEyamaMTAnu | yikkaDA mAmOmu cUci yEla navvInE ||
ca|| mOvimIda gurxutulu mUsukonE mammujUci | yIvELa SrIvEMkaTESuDEla navvInE |
BAviMci mammElitivi pADi diddumaMTEnu | yE veladulatOnaina nEla navvInE ||