Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

edurubaDi kAgiLLu - ఎదురుబడి కాగిళ్ళు

ఎదురుబడి కాగిళ్ళు (రాగం: ) (తాళం : )

ప|| ఎదురుబడి కాగిళ్ళు యేరులాయ మీ వలపు | అదను బదనుగూడి అడుసాయె వలపు ||

చ|| చిక్కని చెమటలను చిప్పిలీని వలపు | చొక్కపు కరగులను జొబ్బిలీని వలపు |
చక్కని సరసముల జాలు వాలీ వలపు | తెక్కుల మచ్చికలచే దీగె వారీ వలపు ||

చ|| జవ్వనము కళల రసములబ్బీ వలపు | నివ్వటిట్లు కోరికల నీరుకమ్మీ వలపు |
రవ్వల తమకముల వువ్విళ్ళూరీ వలపు | చివ్వన దరితీపుల జిడ్డుకట్టీ వలపు ||

చ|| పంతపు రతులనే పాలుగారీ వలపు | బంతి మోవులనే కడు బచ్చిదేరీ వలపు |
ఇంతలో శ్రీ వేంకటేశ యెనసి మీరుండగాను | దొంతరచుట్టరికాన దొప్పదోగీ వలపు ||

edurubaDi kAgiLLu (Raagam: ) (Taalam: )

pa|| edurubaDi kAgiLLu yErulAya mI valapu | adanu badanugUDi aDusAye valapu ||

ca|| cikkani cemaTalanu cippilIni valapu | cokkapu karagulanu jobbilIni valapu |
cakkani sarasamula jAlu vAlI valapu | tekkula maccikalacE dIge vArI valapu ||

ca|| javvanamu kaLala rasamulabbI valapu | nivvaTiTlu kOrikala nIrukammI valapu |
ravvala tamakamula vuvviLLUrI valapu | civvana daritIpula jiDDukaTTI valapu ||

ca|| paMtapu ratulanE pAlugArI valapu | baMti mOvulanE kaDu baccidErI valapu |
iMtalO SrI vEMkaTESa yenasi mIruMDagAnu | doMtaracuTTarikAna doppadOgI valapu ||