ప|| ఎదుటినిధానమ వెటుజూచిన నీ- | వదె వేంకటగిరియనంతుడా ||
చ|| సొగిసి భాద్రపదశుద్ధచతుర్దశి | తగువేడుక నిందరు గొలువ |
పగటుసంపదలు బహుళమొసగు నీ- | వగు వేంకటగిరియనంతుడా ||
చ|| తొలుత సుశీలకు దుశ్శీలవలన | వెలయు సంపదల విముఖుడవై |
వలెనని కొలిచిన వడి గాచినమా- | యలవేంకటగిరియనంతుడా ||
చ|| కరుణ గాచితివి కౌండిన్యుని మును | పరగినవృద్ధబ్రాహ్మడవై |
దొరవులు మావులు ధృవముగ గాచిన- | హరి వేంకటగిరియనంతుడా ||
pa|| eduTinidhAnama veTujUcina nI- | vade vEMkaTagiriyanaMtuDA ||
ca|| sogisi BAdrapadaSuddhacaturdaSi | taguvEDuka niMdaru goluva |
pagaTusaMpadalu bahuLamosagu nI- | vagu vEMkaTagiriyanaMtuDA ||
ca|| toluta suSIlaku duSSIlavalana | velayu saMpadala vimuKuDavai |
valenani kolicina vaDi gAcinamA- | yalavEMkaTagiriyanaMtuDA ||
ca|| karuNa gAcitivi kauMDinyuni munu | paraginavRuddhabrAhmaDavai |
doravulu mAvulu dhRuvamuga gAcina- | hari vEMkaTagiriyanaMtuDA ||