ప|| ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే | వదలక హరిదాసవర్గమైనవారికి ||
చ|| ముంచిన నారాయణమూర్తులే యీజగమెల్ల | అంచితనామములే యీయక్షరాలెల్లా |
పంచుకొన్న శ్రీహరిప్రసాద మీరుచులెల్లా | తెంచివేసి మేలు దా దెలిసేటివారికి ||
చ|| చేరి పారేటినదులు శ్రీపాదతీర్థమే | భారపుయీ భూమితని పాదరేణువే |
సారపుగర్మములు కేశవుని కైంకర్యములే | ధీరులై వివేకించి తెలిసేటివారికి ||
చ|| చిత్తములో భావమెల్లా శ్రీవేంకటేశుడే | హత్తినప్రకృతి యెల్లా నాతనిమాయే |
మత్తిలి యీతనికంటే మరి లేదితరములు | తిత్తిదేహపుబ్రదుకు తెలిసేటివారికి ||
pa|| eduTa nevvaru lEru yiMtA viShNumayamE | vadalaka haridAsavargamainavAriki ||
ca|| muMcina nArAyaNamUrtulE yIjagamella | aMcitanAmamulE yIyakSharAlellA |
paMcukonna SrIhariprasAda mIruculellA | teMcivEsi mElu dA delisETivAriki ||
ca|| cEri pArETinadulu SrIpAdatIrthamE | BArapuyI BUmitani pAdarENuvE |
sArapugarmamulu kESavuni kaiMkaryamulE | dhIrulai vivEkiMci telisETivAriki ||
ca|| cittamulO BAvamellA SrIvEMkaTESuDE | hattinaprakRuti yellA nAtanimAyE |
mattili yItanikaMTE mari lEditaramulu | tittidEhapubraduku telisETivAriki ||
http://annamayya-u.blogspot.com/2009/10/eduta-nevvaru-leru-toppopularannamayyaa.html