ప|| ఎదుటనున్నాడు వీడె ఈ బాలుడు | మదిదెలియమమ్మ ఏమరులోగాని ||
చ|| పరమ పురుషుడట పసులగాచెనట | సరవులెంచిన విన సంగతా యిది |
హరియె తానట ముద్దులందరికి జేసెనట | యిరవాయ నమ్మ సుద్దులేటివోగాని ||
చ|| వేదాల కొడయడట వెన్నలు దొమ్గిలెనట | నాదాన్ని విన్నవారికి నమ్మికాయిది |
ఆదిమూల మితడట ఆడికెల చాతలట | కాదమ్మ యీ సుద్దులెట్టికతలో గాని ||
చ|| అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట | కొలదొకరికి చెప్ప కూడునా యిది |
తెలిసి శ్రీ వేంకటాద్రి దేవుడై విలిచెనట | కలదమ్మ తనకెంత కరుణోగాని ||
pa|| eduTanunnADu vIDe I bAluDu | madideliyamamma EmarulOgAni ||
ca|| parama puruShuDaTa pasulagAcenaTa | saravuleMcina vina saMgatA yidi |
hariye tAnaTa muddulaMdariki jEsenaTa | yiravAya namma suddulETivOgAni ||
ca|| vEdAla koDayaDaTa vennalu domgilenaTa | nAdAnni vinnavAriki nammikAyidi |
AdimUla mitaDaTa ADikela cAtalaTa | kAdamma yI sudduleTTikatalO gAni ||
ca|| ala brahma taMDriyaTa yaSOdaku biDDaDaTa | koladokariki ceppa kUDunA yidi |
telisi SrI vEMkaTAdri dEvuDai vilicenaTa | kaladamma tanakeMta karuNOgAni ||
Sung by:Balakrishna Prasad
|
Another LInk:
http://annamayya-u.blogspot.com/2009/05/edutanunnadu-veede-ee.html