ప|| ఏమి సేయుదు నింక నిందిరాధీశ్వరుడా | నీమఱగు చొచ్చితిని నెరవేర్తుగాక ||
చ|| కడి వోనిజవ్వనము కలిమిలేమెఱుగునా | బడినుండి మిగుల ఋణపరచుగాక |
అడియాసలెల్లా బుణ్యముబాప మెఱుగునా | వెడగుదనలో దయ విడిపించుగాక ||
చ|| వలపువెఱ పెఱుగునా వాడిమొనలకు నైన | బలిమి దూరించ జలపట్టుగాక |
చలనమందినమనసు జాతి నీ తెఱుగునా | కలిసి హేయమున కొడిగట్టించుగాక ||
చ|| యెలమి రతివశము యెగ్గుసిగ్గెఱుగునా | బలిమి దిట్లకు నొడబఱచుగాక |
యిలలోన శ్రీవేంకటేశ నీమాయ లివి | తలగించి యేలితివి దయసేతుగాక ||
pa|| Emi sEyudu niMka niMdirAdhISvaruDA | nImarxagu coccitini neravErtugAka ||
ca|| kaDi vOnijavvanamu kalimilEmerxugunA | baDinuMDi migula RuNaparacugAka |
aDiyAsalellA buNyamubApa merxugunA | veDagudanalO daya viDipiMcugAka ||
ca|| valapuverxa perxugunA vADimonalaku naina | balimi dUriMca jalapaTTugAka |
calanamaMdinamanasu jAti nI terxugunA | kalisi hEyamuna koDigaTTiMcugAka ||
ca|| yelami rativaSamu yeggusiggerxugunA | balimi diTlaku noDabarxacugAka |
yilalOna SrIvEMkaTESa nImAya livi | talagiMci yElitivi dayasEtugAka ||