ప|| ఏమీనెరుగనిమమ్ము నెక్కువసేసి | పామరుల దొడ్డజేసె భాష్యకారులు ||
చ|| గతచన్నవేదాలు కమలజునకు నిచ్చి | ఆతనికరుణచేత నన్నియుగని |
గతిలేకపోయిన కలియుగమున వచ్చి | ప్రతిపాలించగలిగె భాష్యకారులు ||
చ|| లోకమెల్ల వెల్లిబోగ లోననే సురల గాచి | ఆకుమీద దేలినయతనికృప |
కాకరిమతములెల్ల గాలిబుచ్చి పరమిట్టే | పైకొనగ గరుణించె భాష్యకారులు ||
చ|| పంకజపుజేయి చాచి పాదపుబరమిచ్చిన | వేంకటేశుకృపతోడ వెలయు దానే |
తెంకినే వొడయవరై తిరుమంత్రద్వయాన | పంకమెల్ల బోగడిగె భాష్యకారులు ||
pa|| EmIneruganimammu nekkuvasEsi | pAmarula doDDajEse BAShyakArulu ||
ca|| gatacannavEdAlu kamalajunaku nicci | AtanikaruNacEta nanniyugani |
gatilEkapOyina kaliyugamuna vacci | pratipAliMcagalige BAShyakArulu ||
ca|| lOkamella vellibOga lOnanE surala gAci | AkumIda dElinayatanikRupa |
kAkarimatamulella gAlibucci paramiTTE | paikonaga garuNiMce BAShyakArulu ||
ca|| paMkajapujEyi cAci pAdapubaramiccina | vEMkaTESukRupatODa velayu dAnE |
teMkinE voDayavarai tirumaMtradvayAna | paMkamella bOgaDige BAShyakArulu ||