ప|| ఏమిసేసిన నీరుణ మెట్టు వాసును | కామితఫలద వోకరుణానిధి ||
చ|| చేరి కర్మములు నన్ను చెఱువట్టకుండగాను | పేరువాడి వచ్చి విడిపించుకొంటివి |
సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా | నారయదీనుల గంటే నడ్డమై కాతురు ||
చ|| అరులు పంచేంద్రియము లందు నిందు దియ్యగాను | వెరవుతోడ వెనక వేసుకొంటివి |
పరగ నట్టేకాదా బలుపులైనవారు | అరయ బేదలకైన ఆపద మానుతురు ||
చ|| పలుజన్మములే నన్ను పరి అరికొట్టుకోగా | తొలగదోసి నాకు దోడైతివి |
యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు | బలుభయ మిందరికి బాపుచుందురు ||
pa|| EmisEsina nIruNa meTTu vAsunu | kAmitaPalada vOkaruNAnidhi ||
ca|| cEri karmamulu nannu cerxuvaTTakuMDagAnu | pEruvADi vacci viDipiMcukoMTivi |
sAre tagavaTTe kAdA SaktigalavArellA | nArayadInula gaMTE naDDamai kAturu ||
ca|| arulu paMcEMdriyamu laMdu niMdu diyyagAnu | veravutODa venaka vEsukoMTivi |
paraga naTTEkAdA balupulainavAru | araya bEdalakaina Apada mAnuturu ||
ca|| palujanmamulE nannu pari arikoTTukOgA | tolagadOsi nAku dODaitivi |
yelami SrIvEMkaTESa yila SUrulainavAru | baluBaya miMdariki bApucuMduru ||