ప|| ఏటికే యీ దోసము మీ రెఱుగరటే | ఆట దాననింతే నన్ను ఆఱడిబెట్టకురే ||
చ|| తామర మొగ్గలవంటి తగిన నా చన్నులివి | కాముని యమ్ములనేరు కాంతలదేమే |
నా మగని కౌగిటలో ననిచే జక్క వలవి | ప్రేమమున మారుబేరు పెట్టుదురటే ||
చ|| చందురుని బోలేటి సరసపు నా మోము | అందపు బూబంతియంటా నాడు కోకురే |
ముందు నా రమణునికి మోము చూచేటద్దమిది | కందువలేని నిందలు గడింతురటే ||
చ|| తీగెవంటి నామేను దిక్కుల మెఱుగనుచు | పోగులుగా సారె సారె బొగడకురే |
బాగుగ శ్రీ వేంకటేశు పానుపుపై చిగురిది | మోగము గూడెను వేరే వుప్పటించ నేటికే ||
pa|| ETikE yI dOsamu mI rerxugaraTE | ATa dAnaniMtE nannu ArxaDibeTTakurE ||
ca|| tAmara moggalavaMTi tagina nA cannulivi | kAmuni yammulanEru kAMtaladEmE |
nA magani kaugiTalO nanicE jakka valavi | prEmamuna mArubEru peTTuduraTE ||
ca|| caMduruni bOlETi sarasapu nA mOmu | aMdapu bUbaMtiyaMTA nADu kOkurE |
muMdu nA ramaNuniki mOmu cUcETaddamidi | kaMduvalEni niMdalu gaDiMturaTE ||
ca|| tIgevaMTi nAmEnu dikkula merxuganucu | pOgulugA sAre sAre bogaDakurE |
bAguga SrI vEMkaTESu pAnupupai ciguridi | mOgamu gUDenu vErE vuppaTiMca nETikE ||