Learn English Vocabulary & Help the Poor| Vocaulary |<><><><><>Free download annamayya annamacarya top popular audio video songs lyrics music sung by bala subrahmanyam murali krishna prasad mangalampalli priya sisters nitya santoshini sobha raju SP sailaja etc

cekkiTi cE yika nEla - చెక్కిటి చేయిక నేల

చెక్కిటి చేయిక (రాగం: ) (తాళం : )

ప|| చెక్కిటి చేయిక నేల చింతలేల | అక్కరతో నాపె నీ యలపారిచీ గాక ||

చ|| జవ్వనపు సతి తోడి సరసము | చివ్వన నీ మేనెల్లా జెమరింపించె |
పువ్వుల వసంతాలు పొలయాటలూ | నవ్వి నవ్వి నీ మనసు నాము లెక్కింపించె ||

చ|| చక్కెర బొమ్మవంటి యీ సతి పొందులు | చిక్కించి నీకు వలపు చిమ్మిరేగించె |
నిక్కి నిక్కి యాపె జూచె నీ వేడుకలు | చెక్కుల చెనకులయి సిగ్గు విడిపించె ||

చ|| అలమేలు మంగతో నెయ్యపు రతులు | నిలువెల్ల సింగారమై నీకు నమరె |
నెలవై శ్రీ వేంకటేశ నీ తమకము | అలరిన చుట్టరికమై తగిలించె ||

cekkiTi cE (Raagam: ) (Taalam: )

pa|| cekkiTi cE yika nEla ciMtalEla | akkaratO nApe nI yalapAricI gAka ||

ca|| javvanapu sati tODi sarasamu | civvana nI mEnellA jemariMpiMce |
puvvula vasaMtAlu polayATalU | navvi navvi nI manasu nAmu lekkiMpiMce ||

ca|| cakkera bommavaMTi yI sati poMdulu | cikkiMci nIku valapu cimmirEgiMce |
nikki nikki yApe jUce nI vEDukalu | cekkula cenakulayi siggu viDipiMce ||

ca|| alamElu maMgatO neyyapu ratulu | niluvella siMgAramai nIku namare |
nelavai SrI vEMkaTESa nI tamakamu | alarina cuTTarikamai tagiliMce ||