తెలిసితేమోక్షము తెలియకున్న బంధము
కలవమ్టిది బదుకు ఘనునికిని
అనయము సుఖమేడ దవల దు:ఖమేడది
తనువుపై నాసలేనితత్వమతికి
పొనిగితే బాపమేది పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవియోగికిని
తగినయమృతమేది తలవగ విషమేది
తెగి నిరాహారియైనదీరునికిని
పగవారనగ వేరి బంధులనగ వేరీ
వెగటుప్రపంచమెల్ల విడిచేవివేకికి
వేవేలువిధులందు వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టిధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది యితనిదాసునికి
Telisitaemokshamu teliyakunna bamdhamu
Kalavamtidi baduku ghanunikini
Anayamu sukhamaeda davala du:khamaedadi
Tanuvupai naasalaenitatvamatiki
Ponigitae baapamaedi punyamaedi karmamamdu
Vonara phalamollaviyogikini
Taginayamrtamaedi talavaga vishamaedi
Tegi niraahaariyainadeerunikini
Pagavaaranaga vaeri bamdhulanaga vaeree
Vegatuprapamchamella vidichaevivaekiki
Vaevaeluvidhulamdu ve~rapaedi ma~rapaedi
Daivamu namminayattidhanyunikini
Sreevaemkataesvarudu chittamulo nunnavaadu
Yeevalaedi yaavalaedi yitanidaasuniki
|