ప|| పరమపాతకుడ భవబంధుడ శ్రీ- | హరి నిను దలచ నే నరుహుడనా ||
చ|| అపవిత్రుడ నే నమంగళుడ గడు- | నపగతపుణ్యుడ నలసుడను |
కపటకలుష పరికరహృదయుడ నే- | నపవర్గమునకు నరుహుడనా ||
చ|| అతిదుష్టుడ నే నధికదూషితుడ | హతవివేకమతి నదయుడను |
పతిలేనిరమాపతి మిము దలచలే- | నతులగతికి నే నరుహుడనా ||
చ|| అనుపమ విషయ పరాధీనుడ నే- | ననంత మోహభయాతురుడ |
వినుతింపగ దిరువేంకటేశ ఘను- | లనఘులుగాక నే నరుహుడనా ||
pa|| paramapAtakuDa BavabaMdhuDa SrI- | hari ninu dalaca nE naruhuDanA ||
ca|| apavitruDa nE namaMgaLuDa gaDu- | napagatapuNyuDa nalasuDanu |
kapaTakaluSha parikarahRudayuDa nE- | napavargamunaku naruhuDanA ||
ca|| atiduShTuDa nE nadhikadUShituDa | hatavivEkamati nadayuDanu |
patilEniramApati mimu dalacalE- | natulagatiki nE naruhuDanA ||
ca|| anupama viShaya parAdhInuDa nE- | nanaMta mOhaBayAturuDa |
vinutiMpaga diruvEMkaTESa Ganu- | lanaGulugAka nE naruhuDanA ||