pOya gAlaM baDaviki - పోయ గాలం బడవికి

పోయ గాలం బడవికి (రాగం: ) (తాళం : )

ప|| పోయ గాలం బడవికి గాయు వెన్నెలకరణిని |

శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||

చ|| చిత్తము చేకూర్చుకొని చిత్తైకాగ్రతను |

చిత్తజుగురుని దలచుడీ చిత్తజు జొరనీక ||

చ|| బూరుగుమాకున జెందినకీరము చందమున |

ఆరయ నిష్ఫలమగు మరి యన్యుల జేరినను ||

చ|| కూరిమి మాతిరువేంకటగిరిగురు శ్రీపాదములు |

చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన ||

pOya gAlaM baDaviki(Raagam: ) (Taalam: )

pa|| pOya gAlaM baDaviki gAyu vennelakaraNini |

SrIyutu dalacuDI narulu mAyabaDi ceDaka ||

ca|| cittamu cEkUrcukoni cittaikAgratanu |

cittajuguruni dalacuDI cittaju joranIka ||

ca|| bUrugumAkuna jeMdinakIramu caMdamuna |

Araya niShPalamagu mari yanyula jErinanu ||

ca|| kUrimi mAtiruvEMkaTagiriguru SrIpAdamulu |

cErinavAriki Bavamulu ceMda vepuDu naTugAna ||