vIni jUciyaina nEmu - వీని జూచియైన నేము

వీని జూచియైన (రాగం: ) (తాళం : )

ప|| వీని జూచియైన నేము విరతిబొందగలేము | పూని మాబ్రదు కిందుబోలదాయగా ||

చ|| వరుల వేడగబోవు పరనిందకు జొరవు | పరపురుషార్థమే ఫలవృక్షతతులెల్ల |
నరులమై ఘనులమై నానాబుద్ధు లెఱిగి | పొరి మాబ్రదుకు లిందుబోలదాయగా ||

చ|| కామక్రోధాలు లేవు కామతత్త్వ మెఱగవు | కామించినట్లవు నెక్కడనైనా శిల లివి |
దీమసము గలిగియు దెలివి గలిగియును | భూమిలో మాబ్రదుకు కిందుబోలదాయగా ||

చ|| వొకరి గొలువబోవు వొకపంట సేయబోవు | వొకమానిగూడు చేరివుండు పక్షు లాడనాడ |
వొకశ్రీవేంకటపతి నమ్మియుండలేము | మొకెమో మాబ్రదు కిందుబోలదాయగా ||

vIni jUciyaina (Raagam: ) (Taalam: )

pa|| vIni jUciyaina nEmu viratiboMdagalEmu | pUni mAbradu kiMdubOladAyagA ||

ca|| varula vEDagabOvu paraniMdaku joravu | parapuruShArthamE PalavRukShatatulella |
narulamai Ganulamai nAnAbuddhu lerxigi | pori mAbraduku liMdubOladAyagA ||

ca|| kAmakrOdhAlu lEvu kAmatattva merxagavu | kAmiMcinaTlavu nekkaDanainA Sila livi |
dImasamu galigiyu delivi galigiyunu | BUmilO mAbraduku kiMdubOladAyagA ||

ca|| vokari goluvabOvu vokapaMTa sEyabOvu | vokamAnigUDu cErivuMDu pakShu lADanADa |
vokaSrIvEMkaTapati nammiyuMDalEmu | mokemO mAbradu kiMdubOladAyagA ||