kAmayAgamu cEse - కామయాగము చేసె




ప|| కామయాగము చేసెగలికి తన | ప్రేమమే దేవతా ప్రీతిగాను ||
చ|| పొలుపలర సురత తాంబూల రసపానంబు | నళినాక్షి సోమపానంబు గాను |
కలకలంబుల మంచి గళరవంబులమోత | తలకొన్న వేద మంత్రములుగాను ||
చ|| పడతి తనవిరహ తాపమున బుట్టినయగ్ని | అడరి దరికొన్న హోమాగ్నిగాను |
ఒడబడిక సమరతుల నుదయించిన చెమట | దడియుటే యవబౄథంబుగాను ||
చ|| తనరగుచముల రుచులు దంతాక్షతక్రీడ | నునుపైన పశుబంధనంబుగాను
యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు | ఘనమైన దివ్య భోగంబుగాను ||

pa|| kAmayAgamu cEsegaliki tana | prEmamE dEvatA prItigAnu ||

ca|| polupalara surata tAMbUla rasapAnaMbu | naLinAkShi sOmapAnaMbu gAnu |

kalakalaMbula maMci gaLaravaMbulamOta | talakonna vEda maMtramulugAnu ||

ca|| paDati tanaviraha tApamuna buTTinayagni | aDari darikonna hOmAgnigAnu |

oDabaDika samaratula nudayiMcina cemaTa | daDiyuTE yavabRuthaMbugAnu ||

ca|| tanaragucamula ruculu daMtAkShatakrIDa | nunupaina paSubaMdhanaMbugAnu

yenasi SrIvEMkaTESvaruni poMdu | Ganamaina divya BOgaMbugAnu ||


Sung by:Chakrapani

Get this widget | Track details | eSnips Social DNA

Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు