medini jeevula gaava

మేదిని జీవుల గావ మేలుకోవయ్యా - నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా

తగు గోపికల కన్ను దామరలు వికసించె - మిగులు సూర్యనేత్రుడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ - నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా

ఘనదురితపు గలువలు వికసించె - మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ - జనక ! యాశ్రితపారిజాతమేలుకోవయ్యా

వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ - మెరయుదోషరహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ - నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా

maedini jeevula gaava maelukOvayyaa - needayae maakella raksha nidra maelukOvayyaa

tagu gOpikala kannu daamaralu vikasiMche - migulu sooryanaetruDa maelukOvayyaa
teguva raakshasulanae timiramu viriyaga - negaDina paraMjyOti nidra maelukOvayyaa

ghanaduritapu galuvalu vikasiMche - minuku SaSinaetruDa maelukOvayyaa
panivaDi vaedaalanae pakshulellaa balukaga - janaka ! yaaSritapaarijaatamaelukOvayyaa

varalakshmee kuchachakravaakamu loMDoMTi raaya - merayudOsharahita maelukOvayyaa
porasi neevu nityabhOgamulu bhOgiMcha - nirati SreevaeMkaTaeSa naeDu maelukOvayyaa

Sung by:Balakrishna Prasad

MediniJeevulaGava
MediniJeevulaGava....
Hosted by eSnips




Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు