tappuleMchakika darichErchavayyA - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english


తప్పులెంచకిక దరిచేర్చవయ్యా
చెప్పనేల నీచిత్తమయ్యా

కలిదోషహరణ కర్మవిదారణ
సులభపు నీదాసులమయ్యా
కలిగిన శరణాగత వజ్రపంజర
వలనగు నీమరగు వారమయ్యా

దురిత నివారణ దుఃఖవిమోచన
దొరకొని నీభక్తులమయ్యా
కరిరాజవరద కరుణాసముద్ర
సరినిను నమ్మిన జంతులమయ్యా

శ్రీకాంతప్రియ శ్రీవేంకటేశ్వర
కైకొన్న నీకింకరులమయ్యా
మాకేల యితరపు మతదైన్యంబులు
పైకొన బోజేసి(?) పాలించవయ్యా


tappuleMchakika darichErchavayyA
cheppanEla nIchittamayyA

kalidOshaharaNa karmavidAraNa
sulabhapu nIdAsulamayyA
kaligina SaraNAgata vajrapaMjara
valanagu nImaragu vAramayyA

durita nivAraNa du@hkhavimOchana
dorakoni nIbhaktulamayyA
karirAjavarada karuNAsamudra
sarininu nammina jaMtulamayyA

SrIkAMtapriya SrIvEMkaTESwara
kaikonna nIkiMkarulamayyA
mAkEla yitarapu matadainyaMbulu
paikona bOjEsi(?) pAliMchavayyA

Sung&Tuned by:Mangalamapalli Balamuralikrishna


Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు