tegaka paramunaku - Annamayya/annamacarya spiritual/devotional/traditional/top/Popular songs/ lyrics/Audio/videos/telugu/english

తెగక పరమునకు తెరువు లేదు
పగయెల్లా విడువక భవమూ పోదు

కన్నులయెదుటనున్న కాంచనము పై మమత
వున్నంతతడవు మోక్షమొనగూడదు
అన్నముతోడి రుచుల యలమట గలదాకా
పన్నిన సుజ్ఞానము పదిలము గాదు


పక్కనున్న కాంతల భ్రమగల కాలము
మిక్కిలి శ్రీహరి భక్తి మెరయలేదు
వెక్కసపు సంసారవిధి నున్నంతతడవు
నిక్కి పరమధర్మము నిలుకడ గాదు


చిత్తములోపలి పలు చింతలు మానినదాకా
సత్తుగా వైరాగ్యము సమకూడదు
యిత్తల శ్రీవేంకటేశు డేలిన దాసులకైతే
హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు


tegaka paramunaku teruvu lEdu
pagayellA viDuvaka bhavamU pOdu

kannulayeduTanunna kAMchanamu pai mamata
vunnaMtataDavu mOkshamonagUDadu
annamutODi ruchula yalamaTa galadAkA
pannina suj~nAnamu padilamu gAdu


pakkanunna kAMtala bhramagala kAlamu
mikkili SrIhari bhakti merayalEdu
vekkasapu saMsAravidhi nunnaMtataDavu
nikki paramadharmamu nilukaDa gAdu


chittamulOpali palu chiMtalu mAninadAkA
sattugA vairAgyamu samakUDadu
yittala SrIvEMkaTESu DElina dAsulakaitE
hatti vaikuMThapadavi appuDE kaladu


Sung by:Balakrishna Prasad

Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు