hari hari nI mAyAmahima - హరి హరి నీ మాయా

హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ నను గరుణించగదే

తలతును నా పాలిదైవమవని నిను
తలతును తల్లిని దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడగనరాదు

మొక్కుదు నొకపరి మొగినేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు

చూతును నీమూర్తి సులభుడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీ వేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు


hari hari nI mAyAmahima
saravi deliya nanu garuNiMcagadE

talatunu nA pAlidaivamavani ninu
talatunu tallini daMDrivani
malasi yaMtalO marxatunu telutunu
kalavale nunnadi kaDaganarAdu

mokkudu nokapari moginElikavani
mokkudu nI vAdimUlamani
vukkuna garviMci yubbudu saggudu
kakkasamainadi kaDa ganarAdu

cUtunu nImUrti sulabhuDavanucunu
cUtu jagamulaku sOdyamani
yItala SrI vEMkaTESa nannElitivi
kautukamodavenu kaDa ganarAdu


Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు