kaMTE sulaBamidi - కంటే సులభమిది

కంటే సులభమిది (రాగం: ) (తాళం : )

ప|| కంటే సులభమిది కానక యుంటే దుర్లభ- | మింటిలోననే వున్న దిహము బరమును ||

చ|| హరిదాసులు మెట్టినక్కడే పరమపద- | మరయ నిందుకంటె నవల లేదు |
తిరమై వీరిపాదతీర్థమే విరజానది | సొరిది నన్నిచోట్లు చూచినట్టే వున్నది ||

చ|| మచ్చిక వైష్ణవులమాటలెల్లా వేదములు | యిచ్చల నిందుకంటే నింక లేదు |
అచ్చట వీరిప్రసాద మమృతపానములు | అచ్చమై తెలిసేవారి కఱచేత నున్నది ||

చ|| చెలగి ప్రపన్నులసేవే విజ్ఞానము | ఫల మిందుకంటే మఱి పైపై లేదు |
తలప శ్రీవేంకటేశుదాసులే యాతనిరూపు- | లెలమి నెదుట నున్నా రెఱిగినవారికి ||

(Raagam: ) (Taalam: )

pa|| kaMTE sulaBamidi kAnaka yuMTE durlaBa- | miMTilOnanE vunna dihamu baramunu ||

ca|| haridAsulu meTTinakkaDE paramapada- | maraya niMdukaMTe navala lEdu |
tiramai vIripAdatIrthamE virajAnadi | soridi nannicOTlu cUcinaTTE vunnadi ||

ca|| maccika vaiShNavulamATalellA vEdamulu | yiccala niMdukaMTE niMka lEdu |
accaTa vIriprasAda mamRutapAnamulu | accamai telisEvAri karxacEta nunnadi ||

ca|| celagi prapannulasEvE vij~jAnamu | Pala miMdukaMTE marxi paipai lEdu |
talapa SrIvEMkaTESudAsulE yAtanirUpu- | lelami neduTa nunnA rerxiginavAriki ||


Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు