kaMTi SukravAramu - కంటి శుక్రవారము

కంటి శుక్రవారము (రాగం: ) (తాళం : )

ప|| కంటి శుక్రవారము గడియ లేడింట |
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||

చ|| సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి |
కమ్మని కదంబము కప్పు కన్నీరు |
చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి |
తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే స్వామిని ||

చ|| పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనించి |
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడనందరి కనులకింపై |
నిచ్చమల్లె పూవువలె నిటుతానుండే స్వామిని ||

చ|| తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు |
పట్టి కరిగించు వెండి పళ్యాలనించి |
దట్టముగ మేను నిండపట్టించి దిద్ది |
బిట్టు వేడుక మురియు చుండేబిత్తరి స్వామిని ||

kaMTi SukravAramu (Raagam: ) (Taalam: )

pa|| kaMTi SukravAramu gaDiya lEDiMTa |
aMTi alamElmaMga aMDanuMDE svAmini ||

ca|| sommulannI kaDapeTTi soMputO gONamugaTTi |
kammani kadaMbamu kappu kannIru |
cemmatOnu vEShTuvalu rommutala molajuTTi |
tummeda maicAyatOna nemmadinuMDE svAmini ||

ca|| paccakappuramE nUripasiDi ginnelaniMci |
tecci SirasAdiga diganaladi |
accerapaDi cUDanaMdari kanulakiMpai |
niccamalle pUvuvale niTutAnuMDE svAmini ||

ca|| taTTupunugE kUricicaTTalu cEricinippu |
paTTi karigiMcu veMDi paLyAlaniMci |
daTTamuga mEnu niMDapaTTiMci diddi |
biTTu vEDuka muriyu cuMDEbittari svAmini ||


Popular posts from this blog

Komdalalo nelakonna - కొండలలో నెలకొన్న

brahmamekkate para / Tandanana Ahi - బ్రహ్మమొక్కటె పర / తందనాన అహి

ksheerabdhi kanyakaku - క్షీరాబ్ధి కన్యకకు