Eetagavae naaku neeku - ఈతగవే నాకు నీకు

ఈతగవే నాకు (రాగం: సామంతం) (తాళం : )

ఈతగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపుజీవులకు గలదా వివేకము

భారము నీదిగనక పలుమారు బాపములే చేరి మొక్కలాన నే జేసితిని పేరడి దల్లిదండ్రులు బిడ్డ లేమిసేసినాను వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున

కాన నీవుగలవని కడదాకా నేరములే వేవేలు సేసితిని వెఱవక భావించుక యింటిదొర పసురము దెంచుకొని యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు

పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము

యెట్టుండినా నీకు బోదు యెన్నటికిని వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు

Eetagavae naaku(Raagam: Saamamtam) (Taalam: )

Eetagavae naaku neeku nemchi choochitae Kaatarapujeevulaku galadaa vivaekamu

Bhaaramu neediganaka palumaaru baapamulae Chaeri mokkalaana nae jaesitini Paeradi dallidamdrulu bidda laemisaesinaanu Voruchuka muddusaesukumduru lokamuna

Kaana neevugalavani kadadaakaa naeramulae Vaevaelu saesitini ve~ravaka Bhaavimchuka yimtidora pasuramu demchukoni Yaevidhi bairumaesinaa neggusaeya datadu

Puttimchaevaadavu neevu podalaevaaramu naemu

Yettumdinaa neeku bodu yennatikini Vottuka sreevaemkataesa vodagattinadoolamu Atunittu boralinaa namdavaaya depudu


Eeda numde nimdaakaa - ఈడ నుండె నిందాకా

ఈడ నుండె నిందాకా (రాగం: లలిత) (తాళం : )

ఈడ నుండె నిందాకా నింటిముంగిట ఆడ నెందు బోడుగద అప్పుడే యీకృష్ణుడు

యేడ పూతకి జంపె నింతపిన్నవాడంటా ఆడుకొనే రదే వీధి నందరు గూడి వేడుకతో మనగోవిందుడు గాడుగదా చూడరమ్మ వీడు గడుచుల్లరీడు పాపడు

మరలి యపటివాడె మద్దులు విఱిచెనంటా పరువులు పెట్టేరు పడతులెల్లా కరికరించగ రోల గట్టితే నప్పుడు మా హరి గాడుగదా ఆడనున్న బిడ్డడు

వింతగాక నొకబండి విఱిచె నప్పటినంటా రంతు సేసే రదివో రచ్చలు నిండి అంత యీశ్రీవేంకటేశు డైనమనకృష్ణుడంట యింతేకాక యెవ్వరున్నా రిటువంటిపాపడు

Eeda numde nimdaakaa (Raagam:Lalita ) (Taalam: )

Eeda numde nimdaakaa nimtimumgita Aada nemdu bodugada appudae yeekrshnudu

Yaeda pootaki jampe nimtapinnavaadamtaa Aadukonae radae veedhi namdaru goodi Vaedukato managovimdudu gaadugadaa Choodaramma veedu gaduchullareedu paapadu

Marali yapativaade maddulu vi~richenamtaa Paruvulu pettaeru padatulellaa Karikarimchaga rola gattitae nappudu maa Hari gaadugadaa aadanunna biddadu

Vimtagaaka nokabamdi vi~riche nappatinamtaa Ramtu saesae radivo rachchalu nimdi Amta yeesreevaemkataesu dainamanakrshnudamta Yimtaekaaka yevvarunnaa rituvamtipaapadu


Ikeku nIku dagu - ఈకెకు నీకు దగు

ఈకెకు నీకు దగు (రాగం: ) (తాళం : )

ప|| ఈకెకు నీకు దగు నీడు జోడులు | వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు ||

చ|| జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక | అట్టె నిన్ను రామచంద్రుడనదగును |

చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక | చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును ||

చ|| చందమైన వామలోచని యాపెయౌగనక | అందరు నిన్ను వామనుడనదగును |

చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక | అంది నిన్ను నరసింహుడని పిల్వదగును ||

చ|| చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక | అల శ్రీవక్షుడవని యాడదగును |

అలమేల్మంగ యహిరోమావళి గలదిగన | యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును ||

Ikeku nIku dagu (Raagam: ) (Taalam: )

pa|| Ikeku nIku dagu nIDu jODulu | vAkucci mimmu bogaDa vasamA yorulaku ||

ca|| jaTTigonna nIdEvulu caMdramuKi ganaka | aTTe ninnu rAmacaMdruDanadagunu |

cuTTamai kRuShNayyavu cUpula yApe ganaka | cuTTukoni ninnu kRuShNuDanadagunu ||

ca|| caMdamaina vAmalOcani yApeyauganaka | aMdaru ninnu vAmanuDanadagunu |

ceMdi

yAke yeppaTikini siMha madhya ganaka | aMdi ninnu narasiMhuDani pilvadagunu ||

ca|| celuvamaina yApe SrIdEvi yaguganaka | ala SrIvakShuDavani yADadagunu |

alamElmaMga yahirOmAvaLi galadigana | yila SEShAdri SrIvEMkaTESu Danadagunu ||


I viSvAsaMbu yevvariki - ఈ విశ్వాసంబు యెవ్వరికి

ఈ విశ్వాసంబు (రాగం:శ్రీరాగం ) (తాళం : )

ప|| ఈ విశ్వాసంబు యెవ్వరికి దోప దిదిది | పావనులహృదయమున బ్రభవించుగాని ||

చ|| ఇమ్మయినపాపంబు లెన్నివలసిన బ్రాణి | సమ్మతంబున జేయజాలుగాకేమి | కుమ్మరికి నొకయేడు గుదియు కొకనాడవును | నమ్మితలచిన విష్ణునామంబుచేత ||

చ|| కొదలేనిదురితములు కొండలును గోట్లును | చెదర కెప్పుడు బ్రాణి చేయుగాకేమి | పొదరి గొరియలలోన పులిచొచ్చినట్లౌను | హృదయంబు హరిమీద నుండినంతటను ||

చ|| సరిలేనిదుష్కర్మ సంఘములు రాసులై | పెరుగజేయుచు ప్రాణి పెంచుగాకేమి | బెరసి కొండలమీద బిడుగుపడ్డట్లౌను | తిరువేంకటాచలాధిపుని దలచినను ||

I viSvAsaMbu (Raagam:SrIrAgaM) (Taalam: )

pa|| I viSvAsaMbu yevvariki dOpa dididi | pAvanulahRudayamuna braBaviMcugAni ||

ca|| immayinapApaMbu lennivalasina brANi | sammataMbuna jEyajAlugAkEmi | kummariki nokayEDu gudiyu kokanADavunu | nammitalacina viShNunAmaMbucEta ||

ca|| kodalEniduritamulu koMDalunu gOTlunu | cedara keppuDu brANi cEyugAkEmi | podari goriyalalOna pulicoccinaTlaunu | hRudayaMbu harimIda nuMDinaMtaTanu ||

ca|| sarilEniduShkarma saMGamulu rAsulai | perugajEyucu prANi peMcugAkEmi | berasi koMDalamIda biDugupaDDaTlaunu | tiruvEMkaTAcalAdhipuni dalacinanu ||


Ee maata vini ninnu - ఈ మాట విని నిన్ను

ఈ మాట విని (రాగం: సాళంగనాట) (తాళం : )

ఈ మాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను నేమమెంత నేమెంత నీకరుణ యెంత.

సకలకర్మముచేత సాధ్యముగానినీవు వొకైంచుకంతభక్తి కొగిలోనైతి ప్రకటించి బహువేదపఠన జిక్కనినీవు మొకరివై తిరుమంత్రమునకు జిక్కితివి.

కోటిదానములచేత కోరి లోనుగాని నీవు పాటించి శరణంటేనే పట్టి లోనైతి మేటి వుగ్రతపముల మెచ్చి కైకొననినీవు గాటపుదాసు లైతేనే కైకొని మన్నించితి.

పెక్కు తీర్థములాడిన భేదించరానినీవు చొక్కి నీముద్రవారికి సులభుడవు గక్కన దేవతలకు గానరానినీవు మాకు నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి.

Ee maata vini (Raagam:Saalamganaata ) (Taalam: )

Ee maata vini ninnu nimdukae navviti naenu Naemamemta naememta neekaruna yemta.

Sakalakarmamuchaeta saadhyamugaanineevu Vokaimchukamtabhakti kogilonaiti Prakatimchi bahuvaedapathana jikkanineevu Mokarivai tirumamtramunaku jikkitivi.

Kotidaanamulachaeta kori lonugaani neevu Paatimchi saranamtaenae patti lonaiti Maeti vugratapamula mechchi kaikonanineevu Gaatapudaasu laitaenae kaikoni mannimchiti.

Pekku teerthamulaadina bhaedimcharaanineevu Chokki neemudravaariki sulabhudavu Gakkana daevatalaku gaanaraanineevu maaku Nikkada sreevaemkataadri niravaitivi.


I jIvunaku nEdi - ఈ జీవునకు నేది

ఈ జీవునకు నేది (రాగం: ) (తాళం : )

ప|| ఈ జీవునకు నేది గడపల తనకు | నేజాతియును లేక యిట్లున్నవాడు ||

చ|| బహుదేహ కవచముల బారవేసినవాడు | బహుస్వతంత్రముల నాపదనొందినాడు |

బహుకాలముల మింగి పరవశంబైనవాడు | బహు యోనికూపములబడి వెడలినాడు ||

చ|| పెక్కుబాసలు నేర్చి పెంపుమిగిలినవాడు | పెక్కునామములచే బిలువబడినాడు |

పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ | పెక్కులాగుల బెనగి చెండుపడినాడు ||

చ|| ఉండనెన్నడు దనకు ఊరటెన్నడులేక | యెండలకు నీడలకు యెడతాకినాడు |

కొండలలో నెలకొన్న కోనేటిరాయని | యండ జేరెదననుచు నాసపడినాడు ||

I jIvunaku nEdi (Raagam: ) (Taalam: )

pa|| I jIvunaku nEdi gaDapala tanaku | nEjAtiyunu lEka yiTlunnavADu ||

ca|| bahudEha kavacamula bAravEsinavADu | bahusvataMtramula nApadanoMdinADu |

bahukAlamula miMgi paravaSaMbainavADu | bahu yOnikUpamulabaDi veDalinADu ||

ca|| pekkubAsalu nErci peMpumigilinavADu | pekkunAmamulacE biluvabaDinADu |

pekkukAMtalatODa pekkupuruShulatODa | pekkulAgula benagi ceMDupaDinADu ||

ca|| uMDanennaDu danaku UraTennaDulEka | yeMDalaku nIDalaku yeDatAkinADu |

koMDalalO nelakonna kOnETirAyani | yaMDa jEredananucu nAsapaDinADu ||


ihamEkAni yika - ఇహమేకాని యిక

ఇహమేకాని యిక (రాగం: ) (తాళం : )

ప|| ఇహమేకాని యిక బరమేకాని | బహుళమై హరి నీపైభక్తే చాలు ||

చ|| యెందు జనించిన నేమి యెచ్చోటనున్ననేమి | కందువనీదాస్యము గలిగితే జాలు |
అంది స్వర్గమేకాని అలనరకమేకాని | అందపునీనామము నాకబ్బుటే చాలు ||

చ|| దొరయైనజాలు గడు దుచ్ఛపుబంటైన జాలు | కరగి నిన్నుదలచగలితే జాలు |
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు | హరినీసేవాపరుడౌటే చాలు ||

చ|| యిల జదువులురానీ యిటు రాకమాననీ | తలపు నీపాదములతగులే చాలు |
యెలమి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె | చలపట్టి నాకు నీశరణమేచాలు ||

ihamEkAni yika (Raagam: ) (Taalam: )

pa|| ihamEkAni yika baramEkAni | bahuLamai hari nIpaiBaktE cAlu ||

ca|| yeMdu janiMcina nEmi yeccOTanunnanEmi | kaMduvanIdAsyamu galigitE jAlu |
aMdi svargamEkAni alanarakamEkAni | aMdapunInAmamu nAkabbuTE cAlu ||

ca|| dorayainajAlu gaDu ducCapubaMTaina jAlu | karagi ninnudalacagalitE jAlu |
parulumeccinamElu pammidUShiMcinamElu | harinIsEvAparuDauTE cAlu ||

ca|| yila jaduvulurAnI yiTu rAkamAnanI | talapu nIpAdamulatagulE cAlu |
yelami SrIvEMkaTESa yElitivi nannu niTTe | calapaTTi nAku nISaraNamEcAlu ||

Get this widget | Track details | eSnips Social DNA


Get this widget | Track details | eSnips Social DNA