enupOtutO neddu - ఎనుపోతుతో నెద్దు

ఎనుపోతుతో నెద్దు (రాగం: ) (తాళం : )

ప|| ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు | యెనసి ముందర సాగదేటిబ్రదుకు ||

చ|| కడలేనియాసతో కరగికరగి చిత్త- | మెడమవంకకు వచ్చె నేటిబ్రదుకు |
పొడవైనమమతతో బొదల బొదల మాన- | మిడుమపాట్ల బడె నేటిబ్రదుకు ||

చ|| తెగదెంపులేని భ్రాంతికి జిక్కి యాచార- | మెగసి గొందులు దూరె నేటిబ్రదుకు |
పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన- | మిగురువెట్టక మానె నేటిబ్రదుకు ||

చ|| భావింప రోతలోబడి పొరలెడిసౌఖ్య- | మేవగింపడు జీవుడేటిబ్రదుకు |
శ్రీవేంకటేశుపై చిత్తమొక్కటె కాని | యేవంక సుఖము లేదేటిబ్రదుకు ||

enupOtutO neddu (Raagam: ) (Taalam: )

pa|| enupOtutO neddu nErugaTTinayaTlu | yenasi muMdara sAgadETibraduku ||

ca|| kaDalEniyAsatO karagikaragi citta- | meDamavaMkaku vacce nETibraduku |
poDavainamamatatO bodala bodala mAna- | miDumapATla baDe nETibraduku ||

ca|| tegadeMpulEni BrAMtiki jikki yAcAra- | megasi goMdulu dUre nETibraduku |
pagagonna mOhatApamu vEruga vij~jAna- | miguruveTTaka mAne nETibraduku ||

ca|| BAviMpa rOtalObaDi poraleDisauKya- | mEvagiMpaDu jIvuDETibraduku |
SrIvEMkaTESupai cittamokkaTe kAni | yEvaMka suKamu lEdETibraduku ||


ennibAdhalabeTTi yEcedavu - ఎన్నిబాధలబెట్టి యేచెదవు

ఎన్నిబాధలబెట్టి యేచెదవు (రాగం: ) (తాళం : )

ప|| ఎన్నిబాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా|
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా ||

చ|| ప్రతిలేని దురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా |
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా |
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా |
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా ||

చ|| ఆసలనియెడి తాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమా |
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా |
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా |
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా ||

చ|| తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా |
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా |
వరుస నేనుగుమీదివాని సున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా |
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా ||

ennibAdhalabeTTi yEcedavu (Raagam: ) (Taalam: )

pa|| ennibAdhalabeTTi yEcedavu nIviMka yeMtakAlamudAka karmamA|
manniMcumanucu nImarugu joccitimi mAmATAlakiMcavO karmamA ||

ca|| pratilEni duritamula pAlusEyaka nannu pAliMcavaitivO karmamA |
tatitODa nAtmaparitApaMbu tODutanu tagulEla cEsitivO karmamA |
jitakAmulakugAni cEtikini lOnayi cikkavEkAlaMbu karmamA |
matihInulainaTTi mAkunoka paripATi mArgaMbu cUpavO karmamA ||

ca|| AsalaniyeDi tALLa naMTagaTTuka vidhiki nappagiMcitivigade karmamA |
vAsi viDicitimi nIvAramaitimi mammu vanne ceDanIkuvO karmamA |
kAsukunu goragAni gatilEni panikigA kAlUdanIvEla karmamA |
OsariMcoka mAru voyyanE vokarIti nollanani talagumI karmamA ||

ca|| tiruvEMkaTAcalAdhipuni mAyalacEta desala diriginayaTTi karmamA |
haridAsulaguvAri nAdariMtuvugAka aMta noppiMtuvA karmamA |
varusa nEnugumIdivAni sunnaMbaDuga vaccunA nIkiTla karmamA |
paramapuruShOttamuni BramatabaDi nIviTla baTTabayalaitigA karmamA ||


enni chaMdamulaneTlaina - ఎన్ని చందములనెట్లైన

ఎన్ని చందములనెట్లైన (రాగం: ) (తాళం : )

ఎన్ని చందములనెట్లైన నుతింతు
కన్నుల నిన్నే కనుగొంటి గాన ||

గోవిందా యని కొలిచిన నిన్నే
శ్రీ వల్లభుడని చింతింతును
భూవిభుడవు యిది పునరుక్తనకు మీ
దైవ మొకడవే ధరణికి గాన ||

enni chaMdamulaneTlaina (Raagam: ) (Taalam: )

enni chaMdamulaneTlaina nutiMtu
kannula ninnE kanugoMTi gAna ||

gOviMdA yani kolichina ninnE
SrI vallabhuDani chiMtiMtunu
bhUvibhuDavu yidi punaruktanaku mI
daiva mokaDavE dharaNiki gAna ||


enni mahimala - ఎన్ని మహిమల

ఎన్ని మహిమల (రాగం: ) (తాళం : )

ప|| ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు | కనుల పండువులెల్ల గదిసినట్లుండె ||

చ|| పోలింపు కర్పూర కాపు పురుషోత్తమునికి | ఏలీల నుండె నని యెంచి చూచితే |
పాల జలధిలోన పవళింపగా మేన | మేలిమి మీగ డంటిన మెలుపుతో నుండె ||

చ|| తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి | ఎట్టుండెనని మది నెంచి చూచితే |
చిట్టకాన రేపల్లెలో చీకటి తప్పు సేయగా | అట్టె రాత్రులు మేన నంటి నట్లుండె ||

చ|| అలమేలు మంగతో అట్టె సొమ్ము ధరించి | ఎలమి శ్రీ వేంకటేశు నెంచి చూచితే |
కలిమిగల ఈ కాంత కౌగిట పెనగగాను | నిలువెల్ల సిరులై నిండినట్లుండె ||

enni mahimala (Raagam: ) (Taalam: )

pa|| enni mahimala vADE I dEvuDu | kanula paMDuvulella gadisinaTluMDe ||

ca|| pOliMpu karpUra kApu puruShOttamuniki | ElIla nuMDe nani yeMci cUcitE |
pAla jaladhilOna pavaLiMpagA mEna | mElimi mIga DaMTina meluputO nuMDe ||

ca|| taTTu punugu kApu daiva SiKAmaNiki | eTTuMDenani madi neMci cUcitE |
ciTTakAna rEpallelO cIkaTi tappu sEyagA | aTTe rAtrulu mEna naMTi naTluMDe ||

ca|| alamElu maMgatO aTTe sommu dhariMci | elami SrI vEMkaTESu neMci cUcitE |
kalimigala I kAMta kaugiTa penagagAnu | niluvella sirulai niMDinaTluMDe ||


ennilEvu nAkiTuvaMTivi - ఎన్నిలేవు నాకిటువంటివి

ఎన్నిలేవు నాకిటువంటివి (రాగం: ) (తాళం : )

ప|| ఎన్నిలేవు నాకిటువంటివి | కన్నులెదుట నిన్ను గనుగొనలేనైతి ||

చ|| అరయ నేజేసినయపరాధములు చూచి | కరుణించి వొకడైన గాచునా |
కరచరణాదులు కలిగించిననిన్ను | బరికించి నీసేవాపరుడ గాలేనైతి ||

చ|| ఏతరినై నే నెరిగి సేసినయట్టి- | పాతక మొకడైనా బాపునా |
ఆతుమలోనుండి యలరి నోవొసగిన- | చేతనమున నిన్ను జెలగి చేరనైతి ||

చ|| శ్రీవేంకటేశ నే జెసినయితరుల- | సేవ కొకడు దయసేయునా |
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ | నీవాడ ననుబుద్ధి నిలుపనేరనైతి ||

ennilEvu nAkiTuvaMTivi (Raagam: ) (Taalam: )

pa|| ennilEvu nAkiTuvaMTivi | kannuleduTa ninnu ganugonalEnaiti ||

ca|| araya nEjEsinayaparAdhamulu cUci | karuNiMci vokaDaina gAcunA |
karacaraNAdulu kaligiMcinaninnu | barikiMci nIsEvAparuDa gAlEnaiti ||

ca|| Etarinai nE nerigi sEsinayaTTi- | pAtaka mokaDainA bApunA |
AtumalOnuMDi yalari nOvosagina- | cEtanamuna ninnu jelagi cEranaiti ||

ca|| SrIvEMkaTESa nE jesinayitarula- | sEva kokaDu dayasEyunA |
nIvE yiccinayaTTi nE nISarIramutODa | nIvADa nanubuddhi nilupanEranaiti ||


ennicEta lenniguNAlenni - ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని

ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని (రాగం: ) (తాళం : )

ప|| ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని భావాలు ||

చ|| యేమి లీలలు నటియించే వేమయ్య దేవుడా | భూమిలో జీవులనెల్ల బుట్టింపుచు |
ప్రేమతో మాటలాడే పిన్నవాడవూ గావు | నీ మహిమ లిన్నియూ నీకె తెలుసు ||

చ|| యెంతని వదరుకొనే విందిరా నాథుడా | అంతరంగముల నుండె అందరిలోన |
వింతలు లేవు నీకు వెఱ్ఱివాడవు గావు | యింతేసి విచారాలు యివి నీకె తెలుసు ||

చ|| చెలగి వరాలిచ్చేవు శ్రీ వేంకట నాథుడా | తలకక నిన్ను గొల్చే దాసులకు |
అలరి నీవైతేను అశక్తుడవు గావు | నెలవైన నీ సుద్దులు నీకె తెలుసు ||

ennicEta lenniguNAlenni (Raagam: ) (Taalam: )

pa|| ennicEta lenniguNAlenni BAvAlu ||

ca|| yEmi lIlalu naTiyiMcE vEmayya dEvuDA | BUmilO jIvulanella buTTiMpucu |
prEmatO mATalADE pinnavADavU gAvu | nI mahima linniyU nIke telusu ||

ca|| yeMtani vadarukonE viMdirA nAthuDA | aMtaraMgamula nuMDe aMdarilOna |
viMtalu lEvu nIku verxrxivADavu gAvu | yiMtEsi vicArAlu yivi nIke telusu ||

ca|| celagi varAliccEvu SrI vEMkaTa nAthuDA | talakaka ninnu golcE dAsulaku |
alari nIvaitEnu aSaktuDavu gAvu | nelavaina nI suddulu nIke telusu ||

ennaTi cuTTamO - ఎన్నటి చుట్టమో

ఎన్నటి చుట్టమో (రాగం: ) (తాళం : )

ప|| ఎన్నటి చుట్టమో యాకె నెరుగ నేను | అన్నిటా నేనే నీకు నాలనంటా నుందును ||

చ|| నెలత యెవ్వతో కాని నిన్ను బొడగనవచ్చే | చెలప చెమటలతో సిగ్గులతోడ |
చెలుల చెప్పుమనుచుచు జేరి వాకిటనున్నది | తొలుత నీవాపె మోము తోగి చూడవయ్యా ||

చ|| వాని నీకేమౌనో కాని, వలపుల మాటలాడి | వేవేగ దురుము జార విరులరాల |
దేవులవలె దలుపుదెరచి లోనికేతెంచె | భావించి యాపెగురుతు పరికించివయ్యా ||

చ|| యెంత పనికోగాని యేకతము గద్దనీను | సంతసాలు గడునిండ జవులురేగ |
యింతలో శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను | చెంత నన్నేలితి వాకె జిత్తగించవయ్యా ||

ennaTi cuTTamO (Raagam: ) (Taalam: )

pa|| ennaTi cuTTamO yAke neruga nEnu | anniTA nEnE nIku nAlanaMTA nuMdunu ||

ca|| nelata yevvatO kAni ninnu boDaganavaccE | celapa cemaTalatO siggulatODa |
celula ceppumanucucu jEri vAkiTanunnadi | toluta nIvApe mOmu tOgi cUDavayyA ||

ca|| vAni nIkEmaunO kAni, valapula mATalADi | vEvEga durumu jAra virularAla |
dEvulavale dalupuderaci lOnikEteMce | BAviMci yApegurutu parikiMcivayyA ||

ca|| yeMta panikOgAni yEkatamu gaddanInu | saMtasAlu gaDuniMDa javulurEga |
yiMtalO SrI vEMkaTESa yE nalamElumaMganu | ceMta nannEliti vAke jittagiMcavayyA ||