నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ
దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య నోపకరా నన్ను నొడబరపుచు
పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా
చికాకు పడిన నా చిత్త శాంతము సేయ లేకకా నీవు బహులీలనన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా
వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాధ్రీశ నవనీత చోర శ్రీ నారాయణా
NigamaNigamanta
7:06 AM
N - Annamayya