రాగమ్: రామక్రియ
అనుచు నిద్దరునాడే రమడవలెనే మొనసి యివెల్లా జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు
రాముడ పండ్లు నాకు రండు వెట్టరా యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు ప్రేమపుతమ్ముడగాన పిన్ననే నీకు యీమాట మఱవకు యిందరా కృష్ణుడా
యెక్కిన పుట్టిపై నన్ను నెక్కించరా వోరి వుక్కున బడేవు రాకు వద్దురా నీవు పక్కున మొక్కేరా నీపయిడికాళ్ళకు వోరి అక్కతో జెప్పేగాని అందుకొనే రారా
యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి నివ్వటిల్ల నీ వింత నిక్కవొద్దురా రవ్వల శ్రీవేంకటాద్రిరాయడనేరా, అయితే యివ్వల నీకంటే బెద్ద యిది నీ వెఱగవా
Raagam: RaamakriyaAnuchu niddarunaade ramadavalene Monasi yivellaa joochi mrokkiri brahmaadulu
Raamuda pamdlu naaku ramdu vettaraa Yemiraa yitlaane naaku yittuvaa neevu Premaputammudagaana pinnane neeku Yeemaata maravaku yimdaraa krshnudaa
Yekkina puttipai nannu nekkimcharaa vori Vukkuna badevu raaku vadduraa neevu Pakkuna mokkeraa neepayidikaallaku vori Akkato jeppegaani amdukone raaraa
Yevvaru vodavo sari nitu nilutamuraa vori Nivvatilla nee vimta nikkavodduraa Ravvala sreevenkataadriraayadaneraa, ayite Yivvala neekamte bedda yidi nee veragavaa