ప|| అనుమానపుబ్రదుకు కది రోతా తన- | మనసెనయనికూటమి మరి రోతా ||
చ|| అపకీర్తులబడి ఆడికెలోనై | అపవాదియౌట అది రోత |
వుపమ గెలిచెనని వొరు జెరుచుటలు | విపరీతపుగుణ విధమొక రోతా ||
చ|| తనగుట్టెల్లా నెరిగిన వారలముందట | తనయెమ్మెలు చెప్పుకొనుట రోత |
వనితలముందట వదరుచు వదరుచు | కనుగవ గావనిగర్వము రోత ||
చ|| భువి హరిగతియని బుద్ధిదలంచని | యవమానపుమన నది రోత |
భవసంహరుడై పరగు వేంకటపతి- | నవిరళముగ గొలువని దది రోత ||
pa|| anumAnapubraduku kadi rOtA tana- | manasenayanikUTami mari rOtA ||
ca|| apakIrtulabaDi ADikelOnai | apavAdiyauTa adi rOta | vupama gelicenani voru jerucuTalu | viparItapuguNa vidhamoka rOtA ||
ca|| tanaguTTellA nerigina vAralamuMdaTa | tanayemmelu ceppukonuTa rOta | vanitalamuMdaTa vadarucu vadarucu | kanugava gAvanigarvamu rOta ||
ca|| Buvi harigatiyani buddhidalaMcani | yavamAnapumana nadi rOta | BavasaMharuDai paragu vEMkaTapati- | naviraLamuga goluvani dadi rOta ||