Chalu chalu ni jajara - చాలు చాలు నీ జాజర

Chalu chalu ni jajara - చాలు చాలు నీ జాజర | Annamayya Lyrics | Sankeertanalu | Songs | Telugu & English

Listen Audio by P SUSHEELA:

చాలు చాలు నీ (రాగం: ) (తాళం : )

ప|| చాలు చాలు నీ జాజర నన్ను | జాలి బరచేనీ జాజర ||


చ|| వలపు వేదనల వాడెమ యీ- | తలనొప్పుల చే దలకేను |
పులకల మేనితో బొరలేను కడు | జలిగొని చల్లకు జాజర ||


చ|| ఒల్లని నినుగొని వుడికేను నీ- | చిల్లర చేతుల జిమిడేను |
కల్లగంద వొడిగా గేనుపై | జల్లకు చల్లకు జాజర ||


చ|| తివిరి వేంకటాధిప నేను నీ- | కవుగిట కబ్బితిగడు నేను |
రవరవ చమట గరగినేడు యిదె | చవులాయెను నీ జాజర ||

Chaalu chaalu nee (Raagam: ) (Taalam: )

pa|| cAlu cAlu nI jAjara nannu | jAli baracEnI jAjara ||


ca|| valapu vEdanala vADema yI- | talanoppula cE dalakEnu |
pulakala mEnitO boralEnu kaDu | jaligoni callaku jAjara ||


ca|| ollani ninugoni vuDikEnu nI- | cillara cEtula jimiDEnu |
kallagaMda voDigA gEnupai | jallaku callaku jAjara ||


ca|| tiviri vEMkaTAdhipa nEnu nI- | kavugiTa kabbitigaDu nEnu |
ravarava camaTa garaginEDu yide | cavulAyenu nI jAjara ||