ప|| తెలిసినవారికి తెరువిదే మరిలేదు | నళినాక్షు పొగడెడి నామములో నున్నది ||
చ|| ఆకసాన లేదు మోక్ష మటుపాతాళాన లేదు | ఈకడ భూలోకమందు ఎందులేదు |
పైకొని ఆసలెల్ల పారదోలి వెదకితే | శ్రీకాంతు పొగడేటి చిత్తములో నున్నది ||
చ|| సురల వద్ద సోదించ నమృతము | సరి దిక్కులందు లేదు జలధిలో లేదు |
శరణాగతుల పాద జలముల జేర్చికొనే | హరిదాసుల పూజించే అరచేత నున్నది ||
చ|| రాజసాన సుఖమేది రాసి కర్మమందునేది | వోజతోడ నియతుడై వుండినా నేది |
సాజాన శ్రీ వేంకటేశు సరి ముద్రలు ధరించే | తేజముతో విజ్ఞన దేహములొ వున్నది ||
pa|| telisinavAriki teruvidE marilEdu | naLinAkShu pogaDeDi nAmamulO nunnadi ||
ca|| AkasAna lEdu mOkSha maTupAtALAna lEdu | IkaDa BUlOkamaMdu eMdulEdu |
paikoni Asalella pAradOli vedakitE | SrIkAMtu pogaDETi cittamulO nunnadi ||
ca|| surala vadda sOdiMca namRutamu | sari dikkulaMdu lEdu jaladhilO lEdu |
SaraNAgatula pAda jalamula jErcikonE | haridAsula pUjiMcE aracEta nunnadi ||
ca|| rAjasAna suKamEdi rAsi karmamaMdunEdi | vOjatODa niyatuDai vuMDinA nEdi |
sAjAna SrI vEMkaTESu sari mudralu dhariMcE | tEjamutO vij~jana dEhamulo vunnadi ||